
Bigg Boss Telugu, Episode 74: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో మానస్ తనకు దక్కిన గొడ్డలిని సన్నీకిచ్చిన విషయం తెలిసిందే!దీంతో సన్నీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికో స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో సన్నీ.. సిరి దగ్గర నుంచి గోల్డ్‌ను షణ్ముఖ్‌కు ఇచ్చాడు. మొదటి రౌండ్‌లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక, మానస్‌లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ గెలిచింది.
ఇద్దరం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యామని, అందుకే షణ్ను ట్రిప్ అవుతున్నాడని పేర్కొంది సిరి. మీరిద్దరూ ఒకరినొకరు బాగా సీరియస్‌గా తీసుకుంటున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రవి. 'కానీ నీ విషయంలో అతడు ఎందుకంత ట్రిప్ అవుతున్నాడు? నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో ఆలోచించు, నీకు అర్థమవుతుందనుకుంటా, మీరే ఆలోచించుకోండి' అని హితవు పలికాడు.
తర్వాత శ్రీరామచంద్రకు ఓ పవర్ వచ్చింది. అయితే అది అతడికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తన దగ్గర ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన శ్రీరామ్ తనకో పవర్ వచ్చిందంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఈ స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడం గమనార్హం.
రెండో రౌండ్‌లో సన్నీ, సిరి బంగారం వెతుకులాటలో టాప్‌లో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్‌బాస్. అయితే సిరి తరపున వేరొకరు ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సిరి తనకోసం మానస్ పోటీపడతాడని చెప్పింది. అలా సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండర్‌ను చేశాడు.
అయితే ఈ గేమ్ నియమనిబంధనలు తనకు ముందే సరిగా చెప్పలేదంటూ సంచాలకుడైన రవి మీద ఫైర్ అయ్యాడు సన్నీ. అలాగే తన స్నేహితులు మానస్, కాజల్ మీద కూడా చిందులు తొక్కాడు. ఉప్పొంగుకొస్తున్న తన కోపాన్ని తగ్గించుకునేందుకు సన్నీ స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. ఇది హౌస్‌లో నుంచి యానీ మాస్టర్ చూడగా సన్నీ మూగబాషలో సంభాషించాడు. ఈ ఒత్తిడి నా వల్ల కాదన్నట్లు ఫేస్ పెడుతూ సూసైడ్ చేసుకుంటున్నట్లుగా చేతితో గన్ పేల్చుకుని నీళ్లలో పడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment