కాజల్‌కు షాకిచ్చిన రవి, మేడమ్‌ మేడమ్‌ అంటూనే.. | Bigg Boss 5 Telugu: Ravi Stoles Kajal Money In BB Hotel Task | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో దొంగతనం, బిత్తరపోయిన కాజల్‌!

Published Wed, Nov 10 2021 11:33 PM | Last Updated on Wed, Nov 10 2021 11:33 PM

Bigg Boss 5 Telugu: Ravi Stoles Kajal Money In BB Hotel Task - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 67: కేక్‌ తినే అర్హత ఎవరికి ఉందని కంటెస్టెంట్లు చర్చోపచర్చలు పెట్టారు. ఈ తొక్కలో మీటింగ్‌ ఏంటో అర్థం కాని సన్నీ తినేస్తే పోలా అని కేక్‌ తీసుకుని లాగించాడు. ఖరాబవుతుందని తిన్నానంటూనే ఇప్పుడు ఏం పంచాయితీ అవుతుందోనని మథనపడ్డాడు. అన్నట్లుగానే యానీ మాస్టర్‌ వచ్చి సన్నీ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని, నువ్వెలా తింటావని తిట్టుకుంటూ వెళ్లి ఏడ్చేసింది.

బిగ్‌బాస్‌ బీబీ హోటల్‌ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగొట్టమని రవికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. బీబీ హోటల్‌లో శ్రీరామ్‌, షణ్ముఖ్‌ చెఫ్స్‌, వెయిటర్లుగా, యానీ మాస్టర్‌ మేనేజర్‌, రిసెప్షనిస్ట్‌గా, రవి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్‌ కీపింగ్‌, మానస్‌- ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన జంట, కాజల్‌.. హోటల్‌ ఓనర్‌కు స్నేహితురాలు, సన్నీ తొలిసారి 5 స్టార్‌ హోటల్‌కు వచ్చిన అతిథిగా, సిరి.. ఎంతో గారాబంగా పెరిగిన డాన్‌ కూతురుగా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో హోటల్‌ సిబ్బంది అతిథుల నుంచి రూ.15 వేల రూపాయలు గెలిస్తే వారు గెలిచినట్లు లెక్క!

టాస్క్‌ మొదలవగానే ఇంటిసభ్యులు రెచ్చిపోయి మరీ ఆడారు. సన్నీ, సిరి అయితే పాత్రలో జీవించారు. దొరికిందే ఛాన్స్‌ అనుకున్న సిరి షణ్ముఖ్‌ను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించింది. సిరితో ఈజీ కాదు అని పాట పాడుతూ స్విమ్మింగ్‌ పూల్‌లోని నీటిని స్పూన్‌తో తీస్తూ కాఫీ కప్పు నింపాడు షణ్ను. దీంతో అతడికి టిప్పిచ్చింది సిరి. సన్నీ తనను టచ్‌ చేస్తుంటే సైలెంట్‌గా ఉన్నావేంటని మానస్‌ మీద చిర్రుబుర్రులాడింది పింకీ. మరోపక్క రవి.. కాజల్‌ బ్యాగులోంచి డబ్బులు కొట్టేసి ఏమీ ఎరగనట్లున్నాడు. దీంతో కాజల్‌ డబ్బులు పోయాయంటూ మొత్తుకుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో అతిథులు హోటల్‌ సిబ్బందిని ఇంకెన్ని తిప్పలు పెడతారో చూడాలి!

చదవండి: బిగ్‌బాస్‌ షోలో షాకింగ్‌ ఘటన, కంటెస్టెంట్‌ సూసైడ్‌ అటెంప్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement