బిగ్ బాస్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్ శేరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం నేటితో విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సారథి స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను జర్నలిస్ట్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
హీరో వీజే సన్నీ మాట్లాడుతూ.. 'నేను పార్టీ పెట్టబోతున్నా అంటూ చేసిన వీడియోకు చాలా మంది నుంచి ఫోన్స్ వచ్చాయి. `సౌండ్ పార్టీ` టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా మిత్రుల చేతుల మీదుగా మా సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అమెరికాలో ఉంటూ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా పూర్తి చేయడానికి సహకరించారు. కచ్చితంగా సౌండ్ పార్టీ థియేటర్‌లో గట్టిగా సౌండ్ చేస్తుందని నమ్ముతున్నా' అన్నారు.
నటుడు శివన్నారాయణ మాట్లాడుతూ...``సౌండ్ పొల్యూషన్ లేని సౌండ్ పార్టీ ఇది. ప్రతి సన్నివేశం, డైలాగ్ ఎంతో బాగా రాసుకున్నాడు దర్శకుడు. మా జయశంకర్ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉంటూ సినిమాను ముందుకు నడిపించారు`` అన్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత రవి పొలిశెట్టి మాట్లాడుతూ... 'ఇది మా మొదటి తెలుగు సినిమా. USAలో ఆంగ్ల చలన చిత్రాలు, మ్యూజిక్ వీడియోలను నిర్మించడంలో మునుపటి అనుభవం ఉన్నందున, తెలుగు సినిమా వైపు వచ్చాను. 25 కంటే ఎక్కువ స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ప్రతిభావంతుడైన సంజయ్ శేరీ తో "సౌండ్ పార్టీ` సినిమా చేశాము. సినిమా షూటింగ్‌ని కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశాం. ఆగస్ట్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment