Bigg Boss VJ Sunny Speech at Unstoppable Movie Song Launch Event - Sakshi
Sakshi News home page

Unstoppable: ప్రతి సీన్‌ ఎంజాయ్‌ చేస్తారు: వీజే సన్నీ

Published Wed, Apr 12 2023 11:21 AM | Last Updated on Wed, Apr 12 2023 11:36 AM

VJ Sunny Talk About Unstoppable Movie - Sakshi

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్‌ హీరో హీరోయిన్లుగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్‌స్టాపబుల్‌’. రజిత్‌ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘బేబీ బేబీ’ సాంగ్‌ను విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరకల్పనలో కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటను ఇంద్రావతి చౌహాన్‌ పాడారు. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వీజే సన్నీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్‌ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సినిమాలో నా, వీజే సన్నీ టైమింగ్‌ అదిరిపోతుంది’’ అన్నారు సప్తగిరి.

‘‘రిలీజ్‌ తర్వాత చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందుకే చిన్న సినిమాలు తీస్తున్న ప్రతి నిర్మాత నాకు ఓ హీరోయే. ఈ సినిమా తర్వాత  నన్ను ‘అన్‌స్టాపబుల్‌’ డైరెక్టర్‌ డైమండ్‌ రత్నబాబు అని పిలుస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు డైమండ్‌ రత్నబాబు. ‘‘మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చాను. ‘అన్‌స్టాపబుల్‌’ చిన్న సినిమా కాదు. అన్నీ ఉన్న సినిమా’’ అన్నారు రజిత్‌ రావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement