
బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో కంటెస్టెంట్లు ఒకరినొకరు తోసుకుంటూ నెట్టేసుకుంటూ గొడవలకు దిగుతున్నారు. అలా నెట్టేయడం కరెక్ట్ కాదని విశ్వకు సూచించాడు మానస్.. ఇదిలా వుంటే స్వాప్ ఆప్షన్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. తమ టీమ్‌లోని ఒకరిని మరొక టీమ్‌లోని ఒకరితో స్వాప్(మార్పు) చేసుకోవాలని చెప్పాడు. దీంతో తమ టీమ్‌లో నుంచి ఎవరిని పంపించి అవతలి టీమ్‌లో నుంచి ఎవరిని తీసుకోవాలా? అని ఆలోచనలో పడ్డారు హౌస్‌మేట్స్. అయితే సన్నీ.. ఇదొక ఆప్షన్ మాత్రమేనని చెప్పగా షణ్ముఖ్ మధ్యలో అడ్డుకుంటూ ఇది ఆప్షన్ కాదని చెప్పుకొచ్చాడు.
అవకాశం ఇస్తున్నాం అంటే అదొక ఆప్షన్ మాత్రమేనని.. తెలుగులో ఎవరికైనా ఇదే అర్థమవుతుందని సన్నీ పేర్కొనగా అయితే నేను ఇంగ్లీషులో విన్నాను అని ఫైర్ అయ్యాడు షణ్ను. నేను చాలా కూల్‌గా చెప్తున్నా.. అని సన్నీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ఇక్కడ ఏసీ వేయలేదు, వేడిగా ఉందని అతడు కౌంటరిచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ మధ్య మరోసారి లొల్లి షురూ అయింది. నాకూ యాటిట్యూడ్ ఉంటుంది, కానీ అది వేరే ఉంటుంది అని సన్నీ వార్నింగ్ ఇవ్వగా చూపించమని రెచ్చగొట్టాడు షణ్ను. మరి బిగ్‌బాస్ చెప్పిన స్వాప్ అనేది కేవలం ఆప్షన్ మాత్రమేనా? లేదా తప్పనిసరిగా స్వాప్ చేయాల్సిందేనా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment