
Bigg Boss 5 Telugu Promo, Eviction Free Pass Task: బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ప్రవేశపెట్టాడు. ఇది గెల్చుకున్న కంటెస్టెంట్ ఈజీగా ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే వేరే ఎవరినైనా సేవ్ చేయవచ్చు. ఈ పాస్‌ను పొందడం కోసం బిగ్‌బాస్ నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా ఫైర్ అలారమ్ మోగినప్పుడు ఏ ఇద్దరు ట్రక్కులోకి వెళతారో వారు బర్నింగ్ హౌస్‌లో నుంచి ఒకరిని సేవ్ చేస్తూ మరొకరి ఫొటోను కాల్చేసే అధికారం పొందుతారు. అలా చివరి వరకు ఎవరి ఫొటో అయితే కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు పాస్ దక్కుతుంది.
అయితే తనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కన్నా జనాల ఓటింగే ముఖ్యం అని బిగ్‌బాస్‌కు షాకిచ్చాడు షణ్ముఖ్. ప్రేక్షకుల వల్లే ఇక్కడిదాకా వచ్చానని, గెలుపైనా, ఓటమైనా వాళ్ల చేతుల్లో నుంచి తీసుకోవాలని ఉందని చెప్పింది సిరి. అంటే షణ్ను- సిరి తమకు ఈ పాస్ అక్కర్లేదని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పేశారు. మొత్తానికి ఈ గేమ్‌లో సన్నీ గెలిచినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో లీకైంది. అదే నిజమైతే సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఈ వారమే వాడతాడా? ఒకవేళ వాడితే తనకోసం వాడతాడా? ఇతరులను సేవ్ చేయడానికి ఉపయోగిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది!
Comments
Please login to add a commentAdd a comment