Harish Shankar Released ATM Webseries Teaser - Sakshi
Sakshi News home page

ఆసక్తి రేకెత్తిస్తున్న హరీశ్‌ శంకర్‌ ‘ఏటీఎం’ టీజర్‌

Published Sun, Jan 8 2023 2:37 PM | Last Updated on Sun, Jan 8 2023 2:52 PM

Harish Shankar Released ATM Webseries Teaser - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్‌ ఈ సిరీస్‌కి కథ అందించారు.  దోపిడీ నేప‌థ్యంలో సాగే ఈ  క్రైమ్ థ్రిల్ల‌ర్‌కు సి చంద్రమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ‘ఏటీఎం’టీజర్‌ని హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `దోపిడీ జోన‌ర్‌లో రాసే క‌థ‌ల్లో చాలా పొటెన్షియ‌ల్ ఉంటుంది. సెట్టింగ్ రియ‌లిస్టిక్‌గా ఉంటుంది. ఈ సీరీస్‌లో దొంగ‌లు రొటీన్‌గా ఉండ‌రు. వాళ్ల‌ల్లో ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. వీజే స‌న్నీ కీ రోల్ చేశారు. స్ల‌మ్ లైఫ్ మీద అత‌నికున్న ఫ్ర‌స్ట్రేష‌న్ క‌నిపిస్తుంది. న‌వాబ్ త‌ర‌హా జీవితాన్ని కోరుకున్న అత‌ను ఏం చేశాడ‌నేది ఆస‌క్తిక‌రం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్ప‌ద‌ల‌చుకోలేదు. ఓ వైపు న‌వ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్ర‌య‌త్నం చేశాం`అని అన్నారు.

‘ప‌వ‌ర్ ఫుల్ ఫోర్సుల వ‌ల్ల కార్న‌ర్ అయిన న‌లుగురు చిన్న దొంగ‌ల రోల‌ర్ కోస్ట‌రే ఈ సీరీస్‌. ప్రాణాల‌తో బ‌తికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను దోపిడీ చేయాల్సిన ప‌రిస్థితుల్లోకి నెట్ట‌బ‌డిన వాళ్ల క‌థే ఇది. సుబ్బ‌రాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు` అని నిర్మాత హ‌ర్షిత్ రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement