థియేటర్లలో ఎలాంటి సినిమాలొచ్చినా చూస్తారు కానీ ఓటీటీల్లో మాత్రం చాలావరకు థ్రిల్లర్స్‌ని చూసేందుకు జనాలు ఇష్టపడతారు. అందుకు తగ్గట్లే అన్ని భాషల్లోని దర్శకులు డిఫరెంట్ స్టోరీలతో మూవీస్ తీస్తుంటారు. అలా టైమ్ ట్రావెల్ అనేది మంచి కాన్సెప్ట్. హాలీవుడ్‌లో ఈ తరహావి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు హిందీలోనూ ఇలాంటి ఓ క్రేజీ వెబ్ సిరీస్‌ని రెడీ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి మరీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)
గ్యారా గ్యారా (11:11) పేరుతో తీసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. 1990లోని ఓ పోలీస్, 2001లోని అంటే భవిష్యత్ కాలంలోని పోలీస్‌తో వాకీ టాకీ ద్వారా మాట్లాడుతుంటాడు. ఇది కూడా ప్రతిరోజు రాత్రి 11 గంటల 11 నిమిషాలకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇలానే వీళ్లు మర్డర్ మిస్టరీలని పరిష్కరిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎదుర్కొంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఇలా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన వాటిలో 'డార్క్' అనే వెబ్ సిరీస్ నం.1 అని చెప్పొచ్చు. 'గ్యారా గ్యారా' ట్రైలర్ చూస్తుంటే.. 'డార్క్' సిరీస్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఇది తీశారా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నట్లు 'గ్యారా గ్యారా' కూడా 1990, 2001, 2016 టైమ్ లైన్స్‌లో జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 9 నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment