మరోసారి వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్! | Anjali Lead Role Bahishkarana Web Series Release On This OTT Platform From This Date | Sakshi
Sakshi News home page

Anjali: వేశ్య పాత్రలో అంజలి.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Thu, Jul 4 2024 7:07 PM | Last Updated on Thu, Jul 4 2024 7:20 PM

Tollywood Heroine will acts In Special Role In Upcoming Web Series

హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన నటి అంజలి. ఇటీవల విశ్వక్‌ సేన్‌ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో మెప్పించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

అంజలి ప్రస్తుతం మరోసారి అలాంటి విభిన్నమైన పాత్రతో అభిమానులను పలకరించనున్నారు. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్‌ బహిష్కరణ. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా సిరీస్‌ గురించి అంజలి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అంజలి మాట్లాడుతూ..'పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాత్ర చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి సమాజంలో అసమానతలను ఎదుర్కొనే స్త్రీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ అని.. ఇందులో ఆమె చేసిన ప్రయాణం, వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, బేబీ చైత్ర కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement