
Bigg Boss Telugu 5 Promo, Gold Evariki? Coal Evariki?: కంటెస్టెంట్ల తప్పొప్పులను సరిదిద్దేందుకు రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఈ క్రమంలో యాంకర్ రవికి స్ట్రాంగ్ కోటింగ్ పడినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. బాగా ఆడిన వాళ్లకు గోల్డ్, వరస్ట్ పర్ఫామర్స్‌కు కోల్(బొగ్గు) ఇవ్వాలని చెప్పాడు నాగ్. రవి వరస్ట్‌గా ఆడింది సన్నీ అంటూ అతడి చేతికి బొగ్గందించాడు. దీంతో నాగ్.. స్విమ్మింగ్ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావా? అని రవిని సూటిగా ప్రశ్నించాడు. దీనికతడు అలాంటిదేం లేదని బుకాయించాడు. టీషర్ట్స్ సరిగ్గా వేసుకోవాలని చెప్తూ ఉన్నా అతడు వినిపించుకోలేదని తప్పు సన్నీమీదకు తోసేశాడు.
అయితే సన్నీ.. రూల్ బుక్‌లో టీ షర్ట్ పూర్తిగా ధరించాలని ఉందే తప్ప సరిగ్గా ధరించాలని రాసి లేదని చెప్పుకొచ్చాడు. ఇతడి వాదనతో ఏకీభవించని నాగ్.. మరి మానస్ మొదటి నుంచే ఎలా సరిగ్గా వేసుకున్నాడని తిరిగి ప్రశ్నించాడు. దొరికితే దొంగ అంటూ కాజల్ గేమ్‌పైనా సెటైర్లు వేశాడు. ఇక శ్రీరామ్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో తనకొచ్చిన పవర్‌ను రవికిచ్చిన విషయం తెలిసిందేగా. అది నెగెటివ్ పవర్ అని తెలియగానే రవి ముఖం మాడిపోయింది. దీన్ని ప్రస్తావించిన నాగ్.. అతడికి బకరా రవి అన్న పేరు సరిగ్గా సెట్టవుతుందన్నాడు. ఇదిలా వుంటే హౌస్‌మేట్స్ ఎవరిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకోనున్నారనేది నేటి ఎపిసోడ్‌లో తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment