ఎలిమినేషన్‌ను మార్చే అధికారం సన్నీ చేతుల్లో! | Bigg Boss Telugu 5: Sunny Not Used Eviction Free Pass | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కథ కంచికి, రవి ఇంటికి!

Published Sun, Nov 28 2021 4:31 PM | Last Updated on Sun, Nov 28 2021 4:48 PM

Bigg Boss Telugu 5: Sunny Not Used Eviction Free Pass - Sakshi

Bigg Boss Telugu 5 Promo: సండే అంటే ఫన్‌డే మాత్రమే కాదు ఎలిమినేషన్‌డే కూడా! ఈ వారం నామినేషన్స్‌లో రవి, సన్నీ, శ్రీరామ్‌, ప్రియాంక, షణ్ముఖ్‌, కాజల్‌, సిరి ఉన్నారు. వీరిలో సిరి, శ్రీరామ్‌, సన్నీ నిన్నటి ఎపిసోడ్‌లోనే సేవ్‌ అయ్యారు. మిగతావారిలో ఎవరు ఎలిమినేట్‌ కానున్నారన్నది నేడు అధికారికంగా వెల్లడి కానుంది.

ఈ ఎలిమినేషన్‌ ఘట్టంపై తాజాగా ప్రోమో వదిలాడు బిగ్‌బాస్‌. రవి, కాజల్‌ ఇద్దరూ ఎలిమినేషన్‌ అంచుల్లో ఉన్నట్లు చూపించారు. వీరిలో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం మీలో ఒక్కరికే ఉందని నాగ్‌ వెల్లడించాడు. దీంతో సన్నీ తనకు దక్కిన ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను గార్డెన్‌ ఏరియాలోకి పట్టుకొచ్చాడు. మరి సన్నీ ఆ పాస్‌ను ఉపయోగించి ఆ ఇద్దరిలో ఎవరినైనా సేవ్‌ చేశాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే సన్నీ ఆ పాస్‌ను వాడలేదట! రవి ఎలిమినేట్‌ అయ్యాడట! అలాగే ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కూడా నేటితో ఎక్స్‌పైర్‌ అయినట్లు ప్రకటించి షాకిచ్చాడట నాగ్‌.. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement