
Bigg Boss Telugu 5, Uma Devi About VJ Sunny: కార్తీకదీపం ఫేమ్ పావుశేరు భాగ్యం బిగ్‌బాస్ షోను రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే! మంచితనానికి మంచిగా ఉంటూనే తేడా వస్తే తిట్లదండకం అందుకునే ఉమాదేవి అంటే హౌస్‌లో అందరూ బెంబేలెత్తిపోయేవారు. ఆమెతో ఎందుకు గొడవ పెట్టుకోవడంలే అని దూరందూరంగానే ఉండేవారు. అలా అందరితో తగాదాలు పెట్టుకుని ఉమాదేవి రెండోవారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అప్పటినుంచి ఆమె సన్నీకి సపోర్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఈ షోకు రాకముందే అతడితో కలిసి సీరియల్‌లో నటించిన ఉమాదేవి ఒకానొక సమయంలో సన్నీని ఇంటి అల్లుడిగా చేసుకోవాలనుకున్నానని చెప్తూ అందరికీ షాకిచ్చింది.
తాజాగా ఇదే విషయం గురించి సాక్షి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌తో మాట్లాడింది. 'కళ్యాణ వైభోగమే సీరియల్ మొదలు పెట్టినప్పుడు సన్నీ హీరో అని చెప్పారు. సన్నీ ఎవరు? అని అడిగితే నా పెద్ద కూతురు వీజే అని చెప్పింది. అప్పటికే అతడికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను వెళ్లి అతడితో మాట్లాడాను. అబ్బాయి బాగున్నాడు, పెద్దమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని మనసులో అనుకున్నాను. కానీ అంతలోనే మా పెద్దమ్మాయి వచ్చి సన్నీ అన్న అంది. ఆరోజు నుంచి సన్నీ నా కూతుళ్లను చెల్లెలుగా, వీళ్లు అతడిని అన్నగా ఫిక్సయిపోయారు. అలా అత్త అవ్వాల్సినదాన్ని సన్నీకి పిన్నీనైపోయాను. నా కూతురు అతడిని అన్న అని పిలవకపోతే సీన్ ఇంకోలా ఉండేది' అని చెప్పుకొచ్చింది ఉమాదేవి.
Comments
Please login to add a commentAdd a comment