Bigg Boss Telugu 5, Shanmukh Jaswanth: బిగ్‌బాస్ షో ముగింపుకు వస్తుండటంతో కంటెస్టెంట్లు వారి జర్నీని, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. 100 రోజుల తర్వాత తిరిగి కుటుంబంతో గడపనున్నామన్న ఆనందం ఒకవైపు, ఎన్నో గుణపాఠాలు నేర్పిన బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నామన్న బాధ మరోవైపు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పటిలాగే సిరి, షణ్ను కబుర్లలో మునగగా మానస్, సన్నీ ముచ్చట్లలో తేలారు. ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఏం చేయాలో ఊసుపోక కెమెరాలతో మాట్లాడుకున్నాడు.
అయితే త్వరలో ఇంటికి వెళ్తున్నానన్న సంతోషం కన్నా షణ్ముఖ్‌ను వదిలి వెళ్తున్నానన్న బాధే సిరిని ఎక్కువగా వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని షణ్ముఖ్ బెడ్‌పై చేరి అతడికి హగ్గిస్తూ మరీ చెప్పింది. కానీ దీనికన్నా ముందు వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సిరి ప్రియుడు శ్రీహాన్ బిగ్‌బాస్ షోకు వచ్చినప్పుడు టాప్ 5లో ఎవరెవర్ని పెట్టారన్న విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేశాడు షణ్ను. అటు సన్నీ ప్రవర్తనలో కూడా ఏదో తేడా కొడుతోందంటూ అనుమానం వ్యక్తం చేశాడు.
ఈ మేరకు షణ్ముఖ్ సిరితో మాట్లాడుతూ.. 'సన్నీ తన ఇద్దరు ఫ్రెండ్స్ కాజల్, మానస్‌ను టాప్ 5లో చూడాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగా జెన్యూన్ అని పదేపదే మాట్లాడాడు. రెండుమూడువారాలుగా సన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాడనిపించింది. వెళ్లి మీ చోటు(సిరి ప్రియుడు శ్రీహాన్)కు చెప్పు. సన్నీ ఫొటో ఫస్ట్‌లో పెట్టాడుగా.. వాడు ఇలాంటివి చేస్తుంటాడు.. వెళ్లి ఎంకరేజ్ చేయమని చెప్పు. నీకోసం స్టాండ్ తీసుకుంటే మీరు అవతలివాడికి రెస్పెక్ట్ ఇస్తారు. మీవాడికి హౌస్‌లో జరిగేవన్నీ తెలీదేమో.. వెళ్లి చెప్పు. హగ్గివ్వడం తప్పయితే ఇదేంటి.. అంటే ఇదంతా ఓకేనా? ఈ ఇంట్లో నీకు తప్ప ఏ అమ్మాయికి స్ట్రయిట్ హగ్గివ్వలేదు' అని చెప్పుకొచ్చాడు.
దీంతో సిరి బోరుమని ఏడ్చేయగా షణ్ను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అయితే సిరి ఏడ్చింది తనకు కాబోయే భర్తను అన్ని మాటలన్నందుకు కాదు! త్వరలో షణ్నును వదిలి హౌస్ నుంచి వెళ్లిపోతానని! ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా మాటకు మాట ఇచ్చిపడేసే సిరి తన ప్రియుడిపై అలా కామెంట్ చేసినప్పటికీ లైట్ తీస్కోవడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment