Bigg Boss 5 Telugu Winner VJ Sunny New Film Pooja Ceremony - Sakshi
Sakshi News home page

ప్రేక్షకులను మెప్పించడానికి వందశాతం కష్టపడతా : వీజే సన్నీ

Published Tue, May 31 2022 4:46 PM | Last Updated on Tue, May 31 2022 5:03 PM

Bigg Boss 5 Winner VJ Sunny New Film Pooja Ceremony - Sakshi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ  కొత్త చిత్రం ప్రారంభమైంది. అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్), ఏ 2 బి ఇండియా  ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌లో రంజిత్ రావ్.బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సప్తగిరి, పొసాని కృష్ణమురళి, పృద్వి, షకలక శంకర్‌ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.  ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్ తదితరులు పాల్గొన్నారు.

రచయిత విజయేంద్ర ప్రసాద్  హీరో  వి.జె సన్నీ  లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో చిత్ర హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత నటుడుగా నేను ప్రూవ్ చేసుకోవా లని వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమా చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను వందశాతం కష్టపడి పని చేస్తాను. రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ఈ సినిమాకు త్రిమూర్తులు వంటి నిర్మాతల తో పాటు మంచి టీం దొరికారు. సీనియర్ నటులతో నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అంకితం చేస్తున్నానని దర్శకుడు డైమండ్‌ రత్నబాబు అన్నారు. జూన్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ చేసి జూన్,జులై నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకొని దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ఇకపై తమ బ్యానర్‌లో ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే మంచి చిత్రాలను తీసుకొస్తామని అన్నారు నిర్మాత రంజన్‌ రావు బి. ఈ చిత్రానికి బీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement