Director Sampath Nandi Speech At Sound Party Teaser Launch - Sakshi
Sakshi News home page

జాతి రత్నాలులా అనిపిస్తోంది

Published Sat, Aug 19 2023 3:58 AM | Last Updated on Sat, Aug 19 2023 3:10 PM

Director Sampath Nandi Speech At Sound Party Teaser Launch - Sakshi

వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్‌ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. దర్శకుడు జయశంకర్‌ సమర్పణలో సంజయ్‌ శేరి దర్శకత్వంలో రవి పోలి శెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్‌ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ వేడుకకు అతిథిగా హాజరై, టీజర్‌ను విడుదల చేసిన దర్శక–నిర్మాత సంపత్‌ నంది మాట్లాడుతూ– ‘‘సౌండ్‌ పార్టీ’ టీజర్‌ బాగుంది. మరో ‘జాతి రత్నాలు’ సినిమాలా ఉంటుందని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది.

ఈ సినిమా అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో శివన్నారాయణగారు, నేను తండ్రీకొడుకులుగా చేశాం. ఇద్దరం ఫుల్‌గా నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘మా సినిమాను 28 రోజుల్లో పూర్తి చేయగలిగామంటే అది యూనిట్‌ సపోర్ట్‌ వల్లే’’ అన్నారు సంజయ్‌ శేరి. ‘‘ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే మా ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్‌ బ్యానర్‌ను స్టార్ట్‌ చేశాం’’ అన్నారు రవి పోలిశెట్టి. ‘‘నేను చేయాల్సిన ఈ సినిమాను మా తమ్ముడు సంజయ్‌తో చేయించాను. ‘సౌండ్‌ పార్టీ’ను ఆదరిస్తే జంధ్యాల, ఈవీవీగార్ల తరహా చిత్రాలు సంజయ్‌ నుంచి చాలా వస్తాయి’’ అన్నారు జయశంకర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement