Director Sampath Nandi
-
సింబలో మంచి సందేశం ఉంది
‘‘సింబ’ మూవీ ప్రారంభం కావడానికి కారణం ఉదయభాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆమె నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత కేసీఆర్, సంతోష్గార్లు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నాను. ఆ సమయంలోనే నేను ‘సింబ’ కథ విన్నాను. నవ్విస్తూనే అందరికీ కనువిప్పు కలిగేలా మంచి సందేశం ఉన్న సినిమా ఇది’’ అని డైరెక్టర్ సంపత్ నంది అన్నారు. అనసూయ, జగపతిబాబు లీడ్ రోల్స్‌లో మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింబ’. సంపత్‌నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనసూయ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల ప్రశంసలు, అభిమానం వల్లే నేను ‘సింబ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయగలుగుతున్నాను’’ అన్నారు. ‘‘సంపత్‌గారి కథకు నేను దర్శకత్వం వహించాను. ‘సింబ’ ఓ కొత్త ΄ాయింట్‌తో రాబోతోంది’’ అన్నారు మురళీ మనోహర్. ‘‘కోటికిపైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నటీనటులు దివి, భానుచందర్ తదితరులు మాట్లాడారు. -
జాతి రత్నాలులా అనిపిస్తోంది
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలి శెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరులో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకకు అతిథిగా హాజరై, టీజర్‌ను విడుదల చేసిన దర్శక–నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘సౌండ్ పార్టీ’ టీజర్ బాగుంది. మరో ‘జాతి రత్నాలు’ సినిమాలా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో శివన్నారాయణగారు, నేను తండ్రీకొడుకులుగా చేశాం. ఇద్దరం ఫుల్‌గా నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘మా సినిమాను 28 రోజుల్లో పూర్తి చేయగలిగామంటే అది యూనిట్ సపోర్ట్ వల్లే’’ అన్నారు సంజయ్ శేరి. ‘‘ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే మా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు రవి పోలిశెట్టి. ‘‘నేను చేయాల్సిన ఈ సినిమాను మా తమ్ముడు సంజయ్‌తో చేయించాను. ‘సౌండ్ పార్టీ’ను ఆదరిస్తే జంధ్యాల, ఈవీవీగార్ల తరహా చిత్రాలు సంజయ్ నుంచి చాలా వస్తాయి’’ అన్నారు జయశంకర్. -
అది అవాస్తవం... బడ్జెట్లోనే తీశాం!
‘‘నా సినిమా జర్నీ సంతృప్తికరంగా సాగుతోంది. కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. కొన్నింటిని డెవలప్ చేసుకుంటున్నాను. మరికొన్నింటిని తెలుసుకుంటున్నాను’’ అన్నారు డైరెక్టర్ సంపత్ నంది. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘గౌతమ్‌నంద’. భగవాన్, పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపత్ నంది చెప్పిన విశేషాలు. ►‘బెంగాల్ టైగర్’ రిలీజ్ అయిన వెంటనే నేను మూడు, నాలుగు నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాను. ‘రచ్చ’ సినిమా తర్వాత భగవాన్, పుల్లారావులకు నేనో సినిమా చేయాల్సింది. ‘గౌతమ్‌నంద’తో కుదిరింది. కథ విని అద్భుతంగా ఉందని, మా దగ్గర గోపీచంద్‌గారి డేట్స్ ఉన్నాయన్నారు. గోపీగారు ఈ కథకు బాగుంటారనుకుని ఆయనకు కథ చెప్పాను. ఆయన కూడా ఎగై్జట్ అయ్యారు. అలా ఈ సినిమా మంచి ఎనర్జీతో స్టార్టయ్యింది. ►నా గత సినిమాలతో పోలిస్తే కొంచెం టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నాను. నా గత చిత్రాలు రచ్చ, బెంగాల్ టైగర్ కమర్షియల్ సినిమాలు కాబట్టి, ఆడేస్తాయనుకున్నాను. ‘గౌతమ్‌నంద’ కంటెంట్ బేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్. ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు? విమర్శకులు ఎలా రెస్పాండ్ అవుతారు? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ►గౌతమ్ ఘట్టమనేని అనే వ్యక్తి గౌతమ్‌నందగా ఎలా మారాడు? అన్నదే కథ. హీరో క్యారెక్టర్లో రెండు షెడ్స్ ఉంటాయి. డబ్బున్న మనిషి... మంచి మనిషిగా ఎలా మారాడు? అనేది స్టోరీ లైన్. విశ్వంలో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటే మనందరం డబ్బు చుట్టూ తిరుగుతున్నాం అనే కాన్సెప్ట్ నుంచి పుట్టిందే ఈ కథ. ►ఘట్టమనేని అనే సర్ నేమ్‌కు సమాజంలో ఒక గౌరవం ఉంది. ఆ ఫ్యామిలీతో ఎటాచై ఉన్నవారందరూ మంచి స్థానంలో ఉన్నారు. ఆ పేరు పెట్టగానే హీరోను కూడా ప్రేక్షకులు నమ్ముతారనే నమ్మకంతో హీరోకు ఈ పేరు పెట్టడం జరిగింది. ► ‘రచ్చ’, ‘బెంగాల్‌టైగర్’ సినిమాల్లో ఒక బలమైన కథను స్ట్రాంగ్‌గా చెప్పలేకపోయానేమో.. అందుకే అవి నంబర్ వన్ కేటగిరీలోకి వెళ్లలేకపోయాయేమో అన్న ఫీలింగ్ నాకే పర్సనల్‌గా కలిగింది. అందుకే ఒక బలమైన క్యారెక్టర్‌కు మంచి కథ సూట్ అయితే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ స్క్రిప్ట్ రాయడం జరిగింది. ► లుక్ విషయానికొస్తే కథ రాసుకున్నప్పుడే గౌతమ్ ఘట్టమనేని క్యారెక్టర్‌కు నేను స్కెచ్ లుక్స్ రెడీ చేసుకున్నాను. గోపీచంద్‌కు ఆ లుక్స్ చూపించి మనం ట్రై చేయాలి అని చెప్పాను. ఆయన సర్ప్రైజ్ అయ్యారు. పవన్ కల్యాణ్‌గారికి చేసే రాము అనే స్టైలిష్ట్ దగ్గరకు వెళ్లి హెయిర్‌స్టైల్‌ను సెట్ చేశాం. కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్‌తో కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం. అలా ఒక కొత్త లుక్ సెట్ అయింది. ►లుక్ సూట్ అవుతుందో లేదో అని నాకు టెన్షన్‌గా ఉండేది. అంటే గౌతమ్ ఘట్టమనేని అని చెబితే వెర్బల్‌గా మాత్రమే కాదు విజువల్గానూ గ్రాండ్‌గా ఉండా లి. నేను, మా చిత్ర యూనిట్ ఫోర్బ్స్ ఎంట్రీ కోసం వచ్చిన టాప్‌టెన్ లిస్ట్ తీసుకున్నాం. వారి పిల్లలు ఎలా ఉంటారు? థ్రిల్ కోసం ఏం చేస్తారు? ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు? ఎలాంటి బ్రాండ్స్ వేసుకుంటారు? అనేది అబ్జర్వ్ చేశాం. ఈ సినిమాలో గోపీచంద్‌కు అన్నీ ఒరిజినల్ బ్రాండ్స్‌నే వాడటం జరిగింది. ► ఈ సినిమాలో ‘ఇవా’ది ఇంపార్టెంట్ రోల్. ఇవా ఎవరు అంటే డాగ్. గౌతమ్‌కు ఫ్రెండ్. ‘ఇవా’ హీరోకు ఎలా హెల్ప్ చేసింది? అనేది సినిమాలో చూస్తారు. ‘ఇవా’తో షూట్ త్రీడేస్ అనుకుంటే సిక్స్ డేస్ పట్టింది. మేమందరం మాములుగా వస్తే ఇవా మాత్రం బెంజ్ కారులో వచ్చేది. ఈ సినిమాలో ఓ సాంVŠ కోసం కోటి ఖర్చు చేశామన్నది అవాస్తవం. ఈ సినిమాకు ఓవర్ బడ్జెట్ కాలేదు. కథ చెప్పినప్పుడు నిర్మాతలకు ఏ బడ్జెట్ చెప్పామో అదే బడ్జెట్లో తీయడం జరిగింది. కథ పరంగా నాకు చాలా సంతృప్తి కలిగింది. నా గత సినిమాల్లో స్క్రిప్ట్ పరంగా నేను 60 శాతం శాటిస్ఫై అయితే ఈ కథ పరంగా 90 శాతం తృప్తి కలిగింది. ఇది పవన్‌కల్యాణ్‌కు అనుకున్న కథ కాదు. ఆయనతో సినిమా అంటారా.. ఎప్పుడు పిలిస్తే అప్పుడే. ►నాయర్ పిళ్లై అనే అతను రాసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్, రమణ మహర్షి పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్ ఈ సినిమాకి ఆధారం. ఒక మనిషి తన జీవితంలో ఒక్కసారైనా నేను ఎవరు? అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నతోనే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అవుతుంది. ►ప్రస్తుతం నిర్మాతగా ‘పేపర్‌బాయ్’ చేస్తున్నా. ఈ చిత్రానికి. జయ్శంకర్ దర్శకుడు. సినిమాను డబ్బులతో పోల్చకూడదని నా అభిప్రాయం. అయితే తీసిన వారికి, కొన్నవారికి లాభాలు రావాలి. నేను నిర్మాతను అయితే ఎక్కువ డబ్బులు పెడతాను. ► ఇండస్ట్రీలో నాకు గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. మా నాన్నగారే నాకు అన్నీ. నేను అక్షరాలు నేర్చుకున్నది పోసానిగారి దగ్గర కాబట్టి ఆయ నంటే అభిమానం. నెక్ట్స్ సినిమా ఇంకా ఏ హీరోతోనూ అనుకోలేదు. ఇలాగే ఒక మంచి క్యారెక్టర్‌కు కథను డెవలప్ చేసి, దానికి సూట్ అయ్యే హీరోకి వినిపించాలనుకుంటున్నాను. ►ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత ఆరోపణలు రావడం ఎవరికైనా బాధగా ఉంటుంది. రవితేజగారితో ‘బెంగాల్ టైగర్’ సినిమా కోసం ఏడాదిన్నర పని చేశాను. అయితే డ్రగ్స్ గురించి నాకేం తెలియదు. అందుకే ఆడియో ఫంక్షన్ (‘బెంగాల్ టైగర్) లో ఆయన్ను గోల్డ్ అన్నాను. -
గోపీచంద్ సరసన...
సిమ్లా యాపిల్‌లా ఉండే హన్సిక మళ్లీ తెలుగులో నటించనున్నారు. ఈ ఏడాది ‘కళావతి’గా భయపెట్టినా, గతేడాది ‘మగ మహారాజు’, ‘పులి’ చిత్రాల్లో సందడి చేసినా.. అవన్నీ డబ్బింగ్ సినిమాలే. ఈ బ్యూటీ స్ట్రయిట్ తెలుగు చిత్రంలో నటించి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పుడు ఓ స్ట్రయిట్ సినిమా అంగీకరించారు. గోపీచంద్ కథానాయకునిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కథానాయికగా నటించనున్నారామె. గోపీచంద్, హన్సిక జంటగా నటించనున్న తొలి చిత్రమిది. ప్రభాస్‌తో ‘రెబల్’, గోపీచంద్ హీరోగా ‘శంఖం’ వంటి చిత్రాలను నిర్మించిన శ్రీ బాలాజీ సినీ మీడియా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించనుంది. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ప్రతినాయకుడిగా మంచి పేరొచ్చిన తర్వాత ‘యజ్ఙం’తో కథానాయకునిగా మారారు గోపీచంద్. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా మాస్, యాక్షన్ చిత్రాలు చేసినప్పటికీ.. ‘లౌక్యం’తో కామెడీ బాట పట్టారు. ఇటీవల యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఈ తరహాలోనే గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే మంచి కథను దర్శకుడు సంపత్ నంది సిద్ధం చేశారట. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అవకాశం రావడం పట్ల హన్సిక సంతోషం వ్యక్తం చేశారు. -
బెంగాల్ టైగర్ ప్లాటినమ్ డిస్క్ వేడుక
-
ఈ సినిమానే ఓ పండగ!
- సంపత్ నంది ‘‘డిసెంబరు 25న క్రిస్మస్.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి రాబోతోంది. అంతకన్నా ముందే డిసెంబరు 10న ‘బెంగాల్ టైగర్’ పండగ రాబోతోంది. బాక్సాఫీస్‌ను కచ్చితంగా షేక్ చేస్తుంది. ఎవరినీ డిజప్పాయింట్ చేయదు’’ అని దర్శకుడు సంపత్ నంది అన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా నాయకానాయికలుగా సంపత్ నంది దర్శకత్వంలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ- ‘‘పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతనికి కంగ్రాట్స్. మేం మాట్లాడటం కన్నా డిసెంబరు 10న మా సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ- ‘‘ఈ పాటలను హిట్ చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఆడియో చార్ట్స్‌లో టాప్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి. త్వరలో ఫస్ట్ ప్లేస్‌కు వస్తాయి. ‘చూపులతో దీపాల పాట...’ అందరికీ బాగా నచ్చేసింది’’ అని అన్నారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ -‘‘అప్పట్లో చిన్న రచయితనైనా ‘దుబాయ్ శీను’లో రవితేజ నాకు ఐదు పాటలు రాసే అవకాశమిచ్చారు. నే నీ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. రవితేజ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు. భీమ్స్కు మంచి భవిష్యత్తు ఉంది’’ అని చెప్పారు. భాస్కరభట్ల మాట్లాడుతూ- ‘‘నా కెరీర్లో అత్యధికంగా రవితేజ సినిమాలకే రాశాను. ఆయన నటించినవాటిలో దాదాపు 28 సినిమాలకు రాశాను. రవితేజకు టీజింగ్ సాంగ్స్ రాయడమంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా ఓ లాంగ్ జర్నీ. సంపత్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. దర్శకుడిగా అతని తొలి సినిమా నేనే చేశాను. సంపత్ మంచి సినిమా ఇచ్చారు. కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’’ అని నిర్మాత రాధామోహన్ అన్నారు. ‘‘నాకు మంచి అవకామిచ్చిన సంపత్ నందిగారికి చాలా థ్యాంక్స్. నా పుట్టినరోజున ఈ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరగడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాశీ ఖన్నా అన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పారు. ఈ సినిమా పాటల కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు రవితేజ, తమన్నా, రాశీఖన్నా, నిర్మాత రాధామోహన్ బహుమతులు అందజేశారు. -
బెంగాల్ టైగర్
అతని పేరు ఆకాశ్ నారాయణ్. ఫుల్ పవర్ ప్యాక్డ్. కంప్యూటర్స్‌లో మాస్టర్స్ చేసిన ఓ ఇడియట్. అలాంటివాడి కథే ఈ ‘బెంగాల్ టైగర్’ అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది బెంగాల్లో జరిగే కథ కాదనీ, అలాగే పోలీస్ స్టోరీ కూడా కాదనీ, హీరో క్యాలిబర్‌ను రిప్రెజెంట్ చేయడం కోసమే ఈ టైటిల్ పెట్టామని, ఇదొక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అని సంపత్ నంది పేర్కొన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా కాంబినేషన్లో సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26 లేదా 27న విడుదల కానుంది.