Bigg Boss Telugu Today Promo: VJ Sunny Tastes Cake, Anchor Ravi Secret Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: రవికి మరోసారి సీక్రెట్‌ టాస్క్‌, షణ్నును ఆడేసుకున్న సిరి!

Published Wed, Nov 10 2021 6:37 PM | Last Updated on Wed, Nov 10 2021 6:56 PM

Bigg Boss Telugu 5: VJ Sunny Tastes Cake, Anchor Ravi Secret Task - Sakshi

దొరికిందే ఛాన్స్‌ అని రెచ్చిపోయిన సిరి.. షణ్నుతో సపర్యలు చేయించుకుంది. దీంతో అతడు సిరితో అంత ఈజీ కాదు అని ఉన్నమాటనే పాట రూపంలో పాడుకున్నాడు.

Bigg Boss Telugu 5 Today Promo: మరీ ఎక్కువగా ఆలోచిస్తే అన్నీ అనుమానాలే పుట్టుకొస్తాయి. బిగ్‌బాస్‌ కేక్‌ పంపించి ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉంది? అని అడిగితే ఏ ఒక్కరూ టచ్‌ చేయలేకపోయారు. దీనివల్ల నామినేషన్‌లో పడతామేమో, లేదంటే నేరుగా ఎలిమినేట్‌ చేస్తారేమో అని రకరకాలుగా ఆలోచించారు. అయితే సన్నీ మాత్రం ఏదైతే అది అవుతుందని ఆ కేక్‌ను చటుక్కుమని తీసి లటుక్కున తినేశాడు. ఖరాబైతదని తింటున్నానంటూ కవరింగ్‌ ఇచ్చాడు. 

మరో ప్రోమోలో గత సీజన్‌లోని బీబీ హోటల్‌ టాస్క్‌ మరోసారి ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌ చెఫ్స్‌ అండ్‌ వెయిటర్లుగా, మానస్‌- ప్రియాంక హనీమూన్‌ జంటగా, సన్నీ మొదటిసారి ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వచ్చిన గెస్ట్‌గా నటించాల్సి ఉంటుంది. దొరికిందే ఛాన్స్‌ అని రెచ్చిపోయిన సిరి.. షణ్నుతో సపర్యలు చేయించుకుంది. దీంతో అతడు సిరితో అంత ఈజీ కాదు అని ఉన్నమాటనే పాట రూపంలో పాడుకున్నాడు. మరోవైపు బిగ్‌బాస్‌ యాంకర్‌ రవికి మరోసారి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. మరి రవి ఆ సీక్రెట్‌ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాడా? లేదా? బీబీ హోటల్‌లో కంటెస్టెంట్లు ఏ రేంజ్‌లో రచ్చ చేసారో చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement