
Bigg Boss Telugu 5 Latest Promo: గతంలో ఇచ్చిన బిగ్‌బాస్ హోటల్ టాస్క్‌ను ఉన్నదున్నట్లుగా దింపాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో భాగంగా హౌస్‌లో బీబీ హోటల్ రన్ అవుతోంది. ఇందులో జీవితంలోనే మొట్టమొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్‌కు వచ్చిన వ్యక్తిలా సన్నీ ఇరగదీస్తుంటే డాన్ కూతురిగా సిరి రెచ్చిపోతోంది. ఇక హనీమూన్ జంట కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పూలపాన్పుపై సన్నీ పడుకుని యానీకి రావాల్సిన టిప్పును చెడగొట్టాడు.
షణ్ముఖ్, శ్రీరామ్, యానీ.. అతిథులకు అన్ని సపర్యలు చేసినా ఒక్కరూ సరిగా టిప్ ఇవ్వకపోవడంతో అసహనానికి లోనయ్యారు. తన దగ్గర దొంగిలించిన 1700 రూపాయలు తిరిగి ఇచ్చేదాకా పైసా టిప్పు కూడా ఇవ్వమని తెగేసి చెప్పింది కాజల్. అయితే మేము సర్వీసులు ఆపేస్తామని ఎదురు తిరిగాడు రవి. దీంతో సిరి, మానస్, కాజల్ హోటల్‌లో ఫుడ్ దొంగతనం చేసి తిన్నారు. మరి ఈ దొంగతనంపై హోటల్ సిబ్బంది ఎలా స్పందిస్తారు? దీనికి తగ్గ రుసుము వారి దగ్గరి నుంచి రాబడతారా? లేదా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment