
ప్రస్తుతం బిగ్‌బాస్ 7వ సీజన్ నడుస్తోంది. హౌస్‌మేట్స్ గొడవలతో ఓ మాదిరిగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. మరోవైపు ఈ షో ఐదో సీజన్ విజేత వీజే సన్నీ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, పాటలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఇంతకీ ఏ మూవీ? ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్లాన్ ఫెయిల్? ఈసారి ఆమెను కాపాడటం కష్టమే!)
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. తొలుత నవంబరు తొలివారంలో రిలీజ్ అనుకున్నారు కానీ వాయిదా పడింది. తాజాగా నవంబరు 24న కొత్త విడుదల అని ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!)
Comments
Please login to add a commentAdd a comment