
ఎప్పుడెప్పుడు మెట్రో రైలులో ప్రయాణిద్దామా అని ఎదురుచూస్తున్న నగర వాసుల కోరిక మరో మూడు రోజుల్లో నెరవేరబోతుంది. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగబోతుంది. ఈ సందర్భంగా మెట్రో రైలు ఛార్జీలను ఎల్‌అండ్‌టీ నేడు(శనివారం) ప్రకటించింది. మెట్రో రైళ్లలో ప్రయాణించాలంటే కనిష్ట ధర రూ.10గా ఎల్‌అండ్‌టీ తెలిపింది. 2 నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణించాలంటే రూ.15 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 నుంచి 6 కిలోమీటర్ల జర్నీకి రూ.25 ఛార్జీ, 6 నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణించాలంటే రూ.30 ఛార్జీగా, 8 నుంచి 10 కిలోమీటర్ల జర్నీకి 35 రూపాయలుగా ప్రకటించింది.
అదేవిధంగా 10 నుంచి 14 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.40 ఛార్జీని విధించబోతున్నట్టు పేర్కొంది. 14 నుంచి 18 కిలోమీటర్లకు 45 రూపాయల ఛార్జీ, 18 నుంచి 22 కిలోమీటర్లకు రూ.50 ఛార్జీ, 22 నుంచి 26 కిలోమీటర్ల ప్రయాణానికి 55 రూపాయలు, 26 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణానికి 60 రూపాయల ఛార్జీని వసూలు చేయబోతున్నట్టు ఎల్‌అండ్‌టీ తెలిపింది. మెట్రో స్మార్ట్‌కార్డు ధర రూ.200 కాగ, 100 రూపాయల నుంచి ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ కార్డులను ఈనెల 29 నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనుగోలు చేసుకోవచ్చని ఎల్‌అండ్‌టీ పేర్కొంది.
మెట్రో స్టేషన్లు :
నాగోల్
తార్నాకా
ప్రకాష్ నగర్
ఎస్‌ఆర్ నగర్
ఎల్‌అండ్‌టీ నేడు ప్రకటించిన ఈ మెట్రో ఛార్జీలు సాధారణ బస్సు ఛార్జీల కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. సాధారణ ప్రజానీకానికి మెట్రో ఛార్జీలను అందుబాటులోకి తెస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత ఛార్జీలను తగ్గించే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment