
5జీ సేవలపై పలు మొబైల్ నెట్‌వర్క్ సంస్థలు వేగంగా పావులను కదుపుతున్నాయి. కేంద్రం ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించడం, టెలికాం రంగంలో 100శాతం మేర ఎఫ్‌డీఐలను అనుమతి ఇవ్వడంతో టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్ స్థాపన కోసం వేగంగా ప్రణాళికలను రచిస్తున్నాయి. 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియా తాజాగా ఎల్‌అండ్‌టీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 5జీ స్మార్ట్ సిటీల్లో భాగంగా ఎల్ అండ్ టీ, వోడాఫోన్ ఐడియా సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి.
చదవండి: మరో సంచలనం..చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ ప్రయోగం
ఇంటర్నెట్ ఆఫ్ థిగ్స్ (ఐవోటీ), వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలతో ఎల్‌అండ్‌టీ స్మార్ట్‌సిటీ ప్లాట్‌ఫాంపై వోడాఫోన్ ఐడియా పనిచేయనుంది. ఈ ఒప్పందం సందర్భంగా ... వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ మాట్లాడుతూ... 5జీ టెక్నాలజీతో పలు పరిష్కారాలను, స్థిరమైన నగరాలను నిర్మించడానికి వెన్నెముక అని చెప్పారు. 5జీ టెక్నాలజీ రాకతో పట్టణాల్లోని సవాళ్లను సులువుగా పరిష్కరించవచ్చునని అన్నారు.
ఇప్పటికే వొడాఫోన్ ఐడియా(వీఐ) పూణేలో నిర్వహిస్తున్న 5జీ ట్రయల్స్ సమయంలో 3.7 జీబీపీ వేగంతో డేటాను బదిలీ చేసింది. వోడాఫాన్ ఐడియా తన ఓఈఎమ్ భాగస్వాములతో కలిసి 3.5 Ghz బ్యాండ్ 5G ట్రయల్ నెట్‌వర్క్ భాగంగా లో 1.5 Gbps వరకు గరిష్ట డౌన్‌లోడ్ వేగాన్ని సాధించిందని వెల్లడించారు.
చదవండి: దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!