
ఐపీఓకు వస్తోన్న ఎల్ అండ్ టీ మరో సంస్థ
ముంబై: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) నుంచి మరో కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోంది. ఎల్ అండ్ టీకి చెందిన ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌లో తనకున్న వాటాలో ఎల్ అంట్ టీ సంస్థ 15% వరకూ విక్రయించనున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,000 కోట్ల వరకూ ఎల్ అండ్ టీకి లభిస్తాయని అంచనా.