పనులను అడ్డుకున్న గిరిజనులు | stopping works by tribes | Sakshi
Sakshi News home page

పనులను అడ్డుకున్న గిరిజనులు

Published Tue, Aug 2 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

పనులను అడ్డుకున్న గిరిజనులు

పనులను అడ్డుకున్న గిరిజనులు

చలకుర్తి(పెద్దవూర): చలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని కుంకుడుచెట్టు తండాలో అటవీశాఖ అధికారులు చేపడుతున్న కందకాల పనులను మంగళవారం గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సర్వే నంబర్‌ 301లో 405.39 ఎకరాలు, 490లో 12 ఎకరాలు, 491లో 20 ఎకరాలు, 492లో 18 ఎకరాల భూములను భూములు లేని నిరుపేద గిరిజనులకు గతంలో ప్రభుత్వం పట్టాదారు పాస్‌ పుస్తకాలను జారీ చేసిందన్నారు. ఈ భూములు సాగుకు అనుకూలంగా లేకపోవడంతో అలాగేవదిలేశామన్నారు. ఈ భూముల్లో కంపచెట్లు పెరగడంతో అటవీశాఖ అధికారులు తమవే నంటూచుట్టూ జేసీబీలతో కందకాలు తీయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అడ్డుకోవడంతో చేసేది లేక అటవీ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీరాములు, సైదా, చంద్రకళ, సోమ్లా, చందు, వాలియా, రెడ్యా, బాలు, అరుణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement