ఎంకాం చదివి.. సెంట్రింగ్ పనికి వెళ్లలేక... | post graduate commits suicide in warangal | Sakshi
Sakshi News home page

ఎంకాం చదివి.. సెంట్రింగ్ పనికి వెళ్లలేక...

Published Thu, Jun 2 2016 11:01 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

post graduate commits suicide in warangal

నర్సంపేట(వరంగల్): ఉద్యోగం రావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం రాత్రి జరిగింది. నెహ్రూనగర్ కాలనీకి చెందిన ఇప్ప సాంబయ్యు-ఉవు దంపతుల రెండో కువూరుడు ఇప్ప నరేష్(24) ఎంకామ్ పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం ఏడాదిగా అన్వేషిస్తూ ఇంటర్వ్యూలకు వెళ్లేవాడు, ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో తండ్రి, అన్నతో కలసి సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు.

ఎంకామ్ పూర్తి చేసి ఈ పని చేయాల్సి వస్తోందని తరుచూ తండ్రితో చెప్పి బాధపడేవాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా సూసైడ్‌నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏదైనా ఉద్యోగం వస్తే పేదరికం బాధ ఉండేది కాదని, ఏ ఉద్యోగమూ లేని తనకు చావే శరణ్యమని సూసైడ్ నోట్‌లో రాశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement