Actress Pragathi Talk About Her Personal Life And Film Career - Sakshi
Sakshi News home page

నిర్మాతపై కోపంతో ఆ పెళ్లి చేసుకున్న: ప్రముఖ నటి

Published Thu, Jun 8 2023 3:21 PM | Last Updated on Thu, Jun 8 2023 6:29 PM

Actress Pragathi Need Money Any Work Accepted - Sakshi

టాలీవుడ్‌ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెరపై తల్లి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి సోషల్ మీడియాలో విభిన్నమైన ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. పలు వీడియోలతో తన ఫాలోవర్లను అలరిస్తోంది. ఆమె వర్క్ అవుట్ చేస్తూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లికి ముందు తాను అనుభవించిన కష్టాల గురించి ప్రగతి చెప్పు కొచ్చింది.

(ఇదీచదవండి: ట్రోలర్స్​కు ఫోటోలతో ​ కౌంటర్​​ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ)

ఇంట్లో  ఊరికే తింటున్నావ్ అనేలా తన అమ్మ చేసిన కామెంట్లు నచ్చేవి కావని ఆమె తెలిపింది. దాంతో  పిజ్జా షాపులో పని చేశానని ఆమె పేర్కొంది. అంతే కాకుండా డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌లో కూడా పని చేశానని ప్రగతి తెలిపింది.  నేను ఆ సమయంలో లడ్డూలా ఉండే దానిని, అందువల్ల ఒక యాడ్ చేయమని కొందరు అడిగారని తెలిపింది. అలా మోడలింగ్‌లోకి వచ్చాక హీరోయిన్‌గా కూడా అవకాశాలు వచ్చాయి. వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయానని చెప్పు కొచ్చింది. ఆ సమయంలో హీరో కమ్ నిర్మాతతో ఏర్పడిన వివాదం వల్ల సినిమాలే చేయకూడదని నిర్ణయించుకుని 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొంత కాలానికి తన భర్తతో విభేదాలు రావడం వల్ల విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.  కానీ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ప్రగతి వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement