జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు
8లోపు అన్ని పనులు పూర్తి చేయాలి
Published Sun, Aug 7 2016 1:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
–అవాంతరాలు లేకుండా
–పుష్కరాల నిర్వహణకు
–చర్యలు తీసుకోవాలి
–కలెక్టర్ టీకే శ్రీదేవి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వస్తున్న కృష్ణా పుష్కారాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ నెల 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేసి పుష్కరాల నిర్వహణకు ఘాట్‌లన్నింటినీ ప్రత్యేకాధికారులకు అప్పగించాలని కలెక్టర్ డా.టీకే శ్రీదేవి సూచిం చారు. శనివారం రెవెన్యూ సమావేశ మంది రంలో జిల్లా అధికారులు, పుష్కరాల ప్రత్యేక అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు పుష్కర స్నానం మాత్రమే చేయాలని, ఎట్టి పరిస్థితిలో నోట్లోకి నీళ్లు పోకుండా చూసుకోవాలని కోరారు.
వీఐపీ ఘాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన పుష్కరఘాట్లలో 4 నిమిషాలకు మించి భక్తులు స్నానం చేసేందుకు ఎక్కువ సమ యం తీసుకోవద్దని ఆమె కోరారు. పుష్కరాలలో నిర్వహించే 12 రోజులు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆమె కోరారు. భక్తుల సంఖ్యను కూడా నమోదు చేసుకోవాలన్నారు.పుష్కరాల నిర్వహించే 13 మండలాలలో అన్ని పాఠశాలలకు స్థానికంగా సెలవు దినాలుగా ప్రకటించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. 52 పుష్కర ఘాట్లు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. రెండు రోజుల్లో చెత్తా చెదారం తొలగించాలనిడీపీఓను ఆదేశించారు. పుష్కరఘాట్ల ప్రత్యేక అధికారులు వాలంటీర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈనెల 9 లేదా 10 తేదీలలో రిహార్సల్ నిర్వహించాలని ఆదేశించారు.
ఎప్పటికప్పుడు నీటిపరీక్షలు చేయాలి
పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు అన్ని ఘాట్ల వద్ద నీటి నాణ్యతపై పరీక్ష నిర్వహించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సైన్‌బోర్డులను వెంటనే ఏర్పాటుచేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. త్వరత్వరగా దర్శ నంచే యించి పంపించాలని కలెక్టర్ అ న్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మా ట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పూర్తి బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం. రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసా ద్, డీఆర్‌ఓ భాస్కర్, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, పీడీలు పాల్గొన్నారు. అంత కు ముందు కలెక్టర్ డా.టీకే శ్రీదేవితో పాటు జిల్లా అధికారులు ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు.
Advertisement
Advertisement