C0mplete
-
ఘాట్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
– గొందిమల్ల ఘాట్‌ను పరిశీలించిన జెడ్పీ సీఈఓ – గొందిమల్లలోనే సీఈఓ, ఎస్ఈలు, పీడీ బస అలంపూర్ : పుష్కర పనులు త్వరగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ కాంట్రాక్టర్లకు సూచించారు. మండల పరిధిలోని గొందిమల్ల జోగుళాంబ ఘాట్‌ను ఆదివారం ఆయనతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్, హౌసింగ్ పీడీ రమణరావు, డీఎల్పీఓ వెంకటేశ్వర్లు సందర్శించారు. పుష్కర ఘాట్ నిర్మాణ పనులు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, పార్కింగ్ పనులను సమీక్షించారు. పుష్కరాలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో నిర్మాణంలో ఉన్న పనులు ముందుగా సూచించినట్లుగా 8వ తేదీకి పూర్తి చేయాలన్నారు. పార్కింగ్ పనులు పూర్తిచేస్తే భారీ కేడ్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం జెడ్పీసీఈఓతోపాటు ఇతర శాఖల అధికారులు అక్కడే బస చేశారు. వీరితోపాటు తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ మల్లికార్జున్, ఈఓ ఆర్డీఓ రమణరావు ఉన్నారు. -
8లోపు అన్ని పనులు పూర్తి చేయాలి
–అవాంతరాలు లేకుండా –పుష్కరాల నిర్వహణకు –చర్యలు తీసుకోవాలి –కలెక్టర్ టీకే శ్రీదేవి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వస్తున్న కృష్ణా పుష్కారాను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ నెల 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేసి పుష్కరాల నిర్వహణకు ఘాట్లన్నింటినీ ప్రత్యేకాధికారులకు అప్పగించాలని కలెక్టర్ డా.టీకే శ్రీదేవి సూచిం చారు. శనివారం రెవెన్యూ సమావేశ మంది రంలో జిల్లా అధికారులు, పుష్కరాల ప్రత్యేక అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు పుష్కర స్నానం మాత్రమే చేయాలని, ఎట్టి పరిస్థితిలో నోట్లోకి నీళ్లు పోకుండా చూసుకోవాలని కోరారు. వీఐపీ ఘాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన పుష్కరఘాట్లలో 4 నిమిషాలకు మించి భక్తులు స్నానం చేసేందుకు ఎక్కువ సమ యం తీసుకోవద్దని ఆమె కోరారు. పుష్కరాలలో నిర్వహించే 12 రోజులు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆమె కోరారు. భక్తుల సంఖ్యను కూడా నమోదు చేసుకోవాలన్నారు.పుష్కరాల నిర్వహించే 13 మండలాలలో అన్ని పాఠశాలలకు స్థానికంగా సెలవు దినాలుగా ప్రకటించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. 52 పుష్కర ఘాట్లు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. రెండు రోజుల్లో చెత్తా చెదారం తొలగించాలనిడీపీఓను ఆదేశించారు. పుష్కరఘాట్ల ప్రత్యేక అధికారులు వాలంటీర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈనెల 9 లేదా 10 తేదీలలో రిహార్సల్ నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నీటిపరీక్షలు చేయాలి పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు అన్ని ఘాట్ల వద్ద నీటి నాణ్యతపై పరీక్ష నిర్వహించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సైన్బోర్డులను వెంటనే ఏర్పాటుచేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. త్వరత్వరగా దర్శ నంచే యించి పంపించాలని కలెక్టర్ అ న్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మా ట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పూర్తి బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం. రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ప్రసా ద్, డీఆర్ఓ భాస్కర్, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, పీడీలు పాల్గొన్నారు. అంత కు ముందు కలెక్టర్ డా.టీకే శ్రీదేవితో పాటు జిల్లా అధికారులు ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు.