వాగు ఆగేనా.. పనులు సాగేనా | road work stop due to rain | Sakshi
Sakshi News home page

వాగు ఆగేనా.. పనులు సాగేనా

Published Thu, Sep 1 2016 11:16 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

వాగు ఆగేనా.. పనులు సాగేనా - Sakshi

వాగు ఆగేనా.. పనులు సాగేనా

జిల్లాలోని కోటపల్లి మండలం నుంచి వేమనపల్లి మండల కేంద్రం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులకు నీల్వాయి వాగు అడ్డుపడుతోంది. ఈ రెండు మండలాల మధ్య ఆరు నెలలుగా డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ రెండు మండలాల మధ్యలో నీల్వాయి వాగు ఉంది. వర్షాకాలం కావడం, నీల్వాయి వాగుపై నూతన వంతెన నిర్మిస్తుండడంతో రోడ్డు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టుల నిర్మాణంలో ఉపయోగించే పైపులను జేసీబీ సాయంతో వాగు దాటిస్తుండగా సాక్షి కెమెరా కంటికి చిక్కాయి. అయితే 18 రోజుల క్రితం తాతాల్కిక వంతెన, రోడ్డును వేశారు. కానీ మూడు రోజుల కురిసిన వర్షానికి అవి కొట్టుకుపోయాయి. – వేమనపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement