Published
Wed, Jul 27 2016 11:47 PM
| Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
బాల కార్మికులు కాదు.. బడి పిల్లలే
విద్యార్థులు కూలీలుగా మారారు. పాఠశాల గదులను ఊడ్చుతున్నారు. సిమెంటు బస్తాలను మోస్తున్నారు. బెజ్జూరు మండలంలోని సంజీవ్‌నగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం విద్యార్థులు కూలీలుగా మారడం కనిపించింది. ఏంటా అని ఆరా తీస్తే కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. పాఠశాల గది ఒకటి సిమెంటు బస్తాల కారణంగా నిరుపయోగంగా ఉంటోంది. దీనిపై ఆ గ్రామానికి చెందిన యువకుడు ఒకరు విద్యా శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పాఠశాల సిబ్బంది కూలీలకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని విద్యార్థులతోనే ఆ పనులు చేయించారు.– బెజ్జూర్