మాస్కో: గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచదేశాలకు తన ప్రతాపాన్ని చూపిస్తూ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కట్టడికి శానిటైజేషన్, సామాజిక దూరం, వ్యాక్సినేషన్ కార్యక్రమంతో చెక్ పెట్టాలని ఆయా దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా రష్యాలోని లాట్వియాలో కరోనా మరణాలు ఇటీవల ఒక్కసారిగా పెరిగింది. వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం నెల రోజుల లాక్‌డౌన్ కూడా విధించింది. ఓ వైపు వైరస్ వ్యాప్తి చెందడం, మరో వైపు శీతాకాలం కావడంతో అంటువ్యాధుల భయం కూడా రష్యాకు తలనొప్పిగా మారింది.
రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయడం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు. పైగా ఆ వారం పాటు ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ మహమ్మారి అంతానికి సహకరించడంతో వారి జీతం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రజలందరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో రష్యాలో 1,028 మంది మరణించారు. ఇప్పటికే కొన్ని యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా యూకేలో కరోనా కేసుల పెరుగుతూ అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికితోడు శీతాకాలం సమీపిస్తుండడంతో వైరస్ ఫోర్త్ వేవ్ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
చదవండి: మనోడి లక్ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేది..!
Comments
Please login to add a commentAdd a comment