కొత్త ఏడాది మొదలైంది ఇలా..
పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులు నీళ్ల బిందెలు మోస్తున్నాయి. అక్షర ముక్కలు నేర్చుకోవాల్సిన వయసులో చిన్నారులు వెట్టి పనులకు అలవాటు పడున్నారు. కొత్త ఏడాది చదువులు ప్రారంభమైనా కొత్త పుస్తకాలు రాకపోవడంతో చిన్నారులు ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. మంగళవారం జగదేవ్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మధ్యాహ్న వంట కోసం బిందెలతో నీళ్ల మోస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపింది. - జగదేవ్‌పూర్