
మీ ఆలోచనలు కుదురుగానే ఉంటాయా?
ఒక పని చేయాలని కాసేపు అనుకొని, మళ్లీ అంతలోనే వద్దనుకోవటం, వాయిదా వేయాలనుకోవటం, తిరిగి చేయాలనుకోవటం... ఇలాంటి తికమకలు తెలిసినవే. ఆలోచనలను వెంటవెంటనే మార్చుకుంటూ అయోమయానికి గురయ్యే పరిస్థితి మీలోనూ ఉందా? మీ ఆలోచనలు కుదురుగా ఉన్నాయో లేవో సెల్ఫ్‌చెక్ చేయండి.
1. షాపులో ఒక వస్తువును సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా చాలాసేపు దాని గురించి అయోమయంలో ఉంటారు.
ఎ. అవును బి. కాదు
2. ఎవరికైనా మాట ఇచ్చి వెంటనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు.
ఎ. అవును బి. కాదు
3. ఒక క్రమపద్ధతి లేని ఆలోచనా విధానం వల్ల మీ జీవితభాగస్వామి, స్నేహితులతో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి.
ఎ. అవును బి. కాదు
4. మీ అభిప్రాయాలకు కాక ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువనిచ్చి ఆచరించటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
5. పరీక్షల్లో ముందుగా సరైన సమాధానం రాసి దాన్ని మార్చి తర్వాత తప్పుగా రాసిన సందర్భాలు ఉన్నాయి.
ఎ. అవును బి. కాదు
6. ఆలోచనలో క్రమం లేకపోవటం వల్ల అబద్ధాలు చెప్పవలసిన పరిస్థితి కలుగుతుంది.
ఎ. అవును బి. కాదు
7. అభిప్రాయాలను స్థిమితం లేకుండా మార్చుకోవటంవల్ల ప్రయోజనం కలిగిందని మీ అనుభవంలో తెలుసుకున్నారు.
ఎ. కాదు బి. అవును
8.ఎప్పటికప్పుడు మారే మీ అభిప్రాయాలకు ఇతరులను సాకుగా చూపిస్తారు.
ఎ. అవును బి. కాదు
9. స్థిమితంలేని ఆలోచనలు, అభిప్రాయాల వల్ల కొన్నిసార్లు మీరు ఆందోళనకు గురవుతారు.
ఎ. అవును బి. కాదు
10. ఆలోచనలో మార్పుల వల్ల ఒక పనిని చాలాసార్లు చేయవలసి వస్తుంది.
ఎ. అవును బి. కాదు
మీరు టిక్ పెట్టుకున్న సమాధానాలలో ‘ఎ’ లు ఏడు దాటితే మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే మార్చుకొనే మనస్తత్వం మీకుంటుంది. ఇలాంటి నిలకడలేని ఆలోచనలు మీ జీవితంలో చాలా చికాకుని, ఆందోళనని కలిగిస్తాయి.
‘బి’ లు 6 కంటే ఎక్కువగా వస్తే నిర్ణయాలను వెంటవెంటనే మార్చుకొనే మనస్తత్వం మీకుండదు. మీ నిర్ణయాలలో అయోమయానికి తావుండదు. కాబట్టి మీరు ‘ఎ’లను ప్రాతిపదికగా తీసుకోవడం బెటర్.