‘పోలవరం’కు అధునాతన యంత్రాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై ఆస్ట్రేలియా నుంచి అధునాతన యంత్రాలు వచ్చాయి.
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై ఆస్ట్రేలియా నుంచి అధునాతన యంత్రాలు వచ్చాయి. గతంలో జర్మనీ నుంచి కొన్ని అధునాతన యంత్రాలను తీసుకువచ్చారు. తాజాగా ఆస్ట్రేలియా నుంచి భారీ యంత్రాలను తెచ్చారు. దాదాపు నెల కిందట ఈ యంత్రాల విడిభాగాలు రాగా కొన్ని రోజులుగా వాటిని బిగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం త్రివేణి సంస్థ వీటిని తీసుకువచ్చింది.
ఎక్సివేటర్.. కొండల్ని పిండి చేయగల ఎక్సివేటర్ యంత్రాన్ని తీసుకువచ్చారు. దీని బరువు 700 ఎం.టి. టాటానగర్ నుంచి 17 పెద్ద ట్రాలీలలో విడిభాగాలను ఇక్కడకు తీసుకువచ్చారు. వాటిని బిగించేందుకు నెల రోజులు పట్టింది. దీని ఖరీదు రూ.70 కోట్లు. దీనికి రెండు ఇంజిన్లు ఉంటాయి. 3 వేల హెచ్‌పీ కెపాసిటీ. 36 క్యూబిక్ మీటర్ల కొండను లేదా మట్టిని ఒకేసారి తీయగలదు. రిలయన్స్, త్రివేణి సంస్థలలో మాత్రమే ఇవి ఉన్నాయి.
డంపర్‌లు .. ఐదు డంపర్లను తీసుకువచ్చారు. వాటిలో ఒక డంపర్ బిగింపు పూర్తికాగా మరో నాలుగు బిగింపు దశలో ఉన్నాయి. డంపర్ కెపాసిటీ 245 ఎంటీ రాయిని, మట్టిని తొలగించేందుకు వీటిని వినియోగిస్తారు. ఒక్కో డంపర్ ఖరీదు రూ.10 కోట్లు. ఈ యంత్రాలను వినియోగించటం ద్వారా పనులు వేగవంతం అవుతాయని కాంట్రాక్ట్ సంస్థ అధికారులు చెబుతున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ యంత్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.