చాలామంది తమ వేతనం సరిపోకవడంతోనో లేదా ఇతరత్రా కారణాలతోనో ఒక షిఫ్ట్ పని చేయగనే... మళ్లీ వెంటనే మరో షిఫ్ట్ చేస్తుంటారు. ఇలా మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా వెంటవెంటనే పనిచేసేవాళ్లలో కనిపించే సమస్యల్లో ఒకటి ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’. రాత్రీ, పగలూ తేడాలేకుండా వెంటవెంటనే పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్‌కు అనుకూలంగా వారి దేహం ఇమడలేపోవడంతో వచ్చే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.
వర్క్‌షిఫ్ట్ డిజార్డర్స్‌కు లోనయ్యేవారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉంటారు. వాళ్లలో నిద్రపట్టడంలో ఇబ్బంది, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. దాంతో పనిప్రదేశాల్లో తప్పులు చేయడం, గాయపడటం జరగవచ్చు. తరచూ అనారోగ్యాల బారిన పడటం కూడా జరుగుతుండవచ్చు. దీర్ఘకాలిక పరిణామాలుగా రక్తంలో కొవ్వు పదార్థాల మోతాదులు పెరగడం, రొమ్ము, పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ల బారిన పడటం, గుండె జబ్బుల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి.
వర్క్ షిఫ్ట్ డిజార్డర్‌కు కారణమిదే...
మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. మన తినేవేళలు, నిద్ర సమయాలు ఆ గడియారంలో ఓ అలారంలా నమోదై ఉంటాయి. దాంతో మనం ఓ క్రమబద్ధమైన రీతిలో పనులు చేస్తుంటాం. మనలో తమకు తెలియకుండానే నిర్వహిలమయ్యే ఈ క్రమబద్ధతను ‘సర్కేడియన్ రిథమ్’ అంటారు. ఈ రిథమ్ మారి΄ోవడం, ఈ లయ దెబ్బతినడం (సర్కేడియమ్ ఆల్టరింగ్ సిగ్నల్స్) వల్ల వచ్చే సమస్యలో ముఖ్యమైనది ‘వర్క్ షిఫ్ట్ డిజార్డర్’.
లక్షణాలు...
సాధారణంగా షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్ర΄ోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే అలసిపోతుంటారు. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్ర΄ోయినప్పటికీ వాళ్లకూ ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. బాధితుల్లో ఈ ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ కారణంగా... తరచూ ఆపుకోలేని కోపం రావడం, త్వరత్వరగా భావోద్వేగాలకు గురికావడం (మూడ్ స్వింగ్స్), తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి.
నిర్ధారణ
రాత్రివేళల్లో నిద్రలేమి అలాగే పగటిపూట నిద్ర ముంచుకొస్తుండటం. పని ప్రదేశంలో మాటిమాటికీ నిద్ర వస్తుండటం.
పైన పేర్కొన్న లక్షణం షిఫ్టుల్లో పనిచేస్తున్నప్పుడు కనీసం నెల రోజుల పాటు కనిపించడం.
నిద్ర ఎంత పడుతుందన్నది తెలుసుకోవడం కోసం ఉపయోగపడే పరికరం ఆక్టిగ్రఫీ సహాయంతో ఏడురోజుల పాటు పరిశీలించినప్పుడు సర్కేడియన్ రిథమ్, స్లీప్ – టైమ్ గ్రాఫ్‌తో సరిగా సరిపోలకపోవచ్చు.
నివారణ/చికిత్స..
ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ వంటివి తక్కువగా తీసుకోవడంతోపాటు ఈ కింది అంశాలను బాధితులకు చికిత్సలో భాగంగా సూచిస్తారు, ఇక చికిత్సలో భాగంగా అందించే ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీలో బాగా తీక్షణమైన వెలుతురులో 3 – 6 గంటల పాటు ఉంచడం
షిఫ్ట్ మొదలవడానికి ముందర కొద్దిసేపు కునుకు పట్టేలా చేయడం. (షార్ట్ షెడ్యూల్డ్ న్యాప్స్ (ప్రీ–షిఫ్ట్)
ఇంటికి బయల్దేరే సమయంలో అది సాయంత్రమైనప్పటికీ నల్లటి గాగుల్స్ ధరించేలా చూడటం ఇంటి దగ్గర నిద్ర సమయంలో పూర్తిగా దట్టమైన చీకట్లో నిద్రపోయేలా చేయడం. ఆ టైమ్‌లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉండేలా చూడటం సూర్యోదయం పూట వెలుగు వస్తున్నప్పుడు నిద్రపట్టడానికి మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ ఇవ్వడం బాధితులు ఇంటికి వెళ్లగానే నిద్రకు ఉపక్రమించేలా సూచనలు ఇవ్వడం.
కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్
(చదవండి: అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!)
Comments
Please login to add a commentAdd a comment