shift
-
డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!
చాలామంది తమ వేతనం సరిపోకవడంతోనో లేదా ఇతరత్రా కారణాలతోనో ఒక షిఫ్ట్ పని చేయగనే... మళ్లీ వెంటనే మరో షిఫ్ట్ చేస్తుంటారు. ఇలా మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా వెంటవెంటనే పనిచేసేవాళ్లలో కనిపించే సమస్యల్లో ఒకటి ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’. రాత్రీ, పగలూ తేడాలేకుండా వెంటవెంటనే పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా వారి దేహం ఇమడలేపోవడంతో వచ్చే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.వర్క్షిఫ్ట్ డిజార్డర్స్కు లోనయ్యేవారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉంటారు. వాళ్లలో నిద్రపట్టడంలో ఇబ్బంది, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. దాంతో పనిప్రదేశాల్లో తప్పులు చేయడం, గాయపడటం జరగవచ్చు. తరచూ అనారోగ్యాల బారిన పడటం కూడా జరుగుతుండవచ్చు. దీర్ఘకాలిక పరిణామాలుగా రక్తంలో కొవ్వు పదార్థాల మోతాదులు పెరగడం, రొమ్ము, పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ల బారిన పడటం, గుండె జబ్బుల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. వర్క్ షిఫ్ట్ డిజార్డర్‌కు కారణమిదే... మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. మన తినేవేళలు, నిద్ర సమయాలు ఆ గడియారంలో ఓ అలారంలా నమోదై ఉంటాయి. దాంతో మనం ఓ క్రమబద్ధమైన రీతిలో పనులు చేస్తుంటాం. మనలో తమకు తెలియకుండానే నిర్వహిలమయ్యే ఈ క్రమబద్ధతను ‘సర్కేడియన్ రిథమ్’ అంటారు. ఈ రిథమ్ మారి΄ోవడం, ఈ లయ దెబ్బతినడం (సర్కేడియమ్ ఆల్టరింగ్ సిగ్నల్స్) వల్ల వచ్చే సమస్యలో ముఖ్యమైనది ‘వర్క్ షిఫ్ట్ డిజార్డర్’. లక్షణాలు... సాధారణంగా షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్ర΄ోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే అలసిపోతుంటారు. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్ర΄ోయినప్పటికీ వాళ్లకూ ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. బాధితుల్లో ఈ ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ కారణంగా... తరచూ ఆపుకోలేని కోపం రావడం, త్వరత్వరగా భావోద్వేగాలకు గురికావడం (మూడ్ స్వింగ్స్), తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి. నిర్ధారణరాత్రివేళల్లో నిద్రలేమి అలాగే పగటిపూట నిద్ర ముంచుకొస్తుండటం. పని ప్రదేశంలో మాటిమాటికీ నిద్ర వస్తుండటం. పైన పేర్కొన్న లక్షణం షిఫ్టుల్లో పనిచేస్తున్నప్పుడు కనీసం నెల రోజుల పాటు కనిపించడం. నిద్ర ఎంత పడుతుందన్నది తెలుసుకోవడం కోసం ఉపయోగపడే పరికరం ఆక్టిగ్రఫీ సహాయంతో ఏడురోజుల పాటు పరిశీలించినప్పుడు సర్కేడియన్ రిథమ్, స్లీప్ – టైమ్ గ్రాఫ్‌తో సరిగా సరిపోలకపోవచ్చు.నివారణ/చికిత్స..ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ వంటివి తక్కువగా తీసుకోవడంతోపాటు ఈ కింది అంశాలను బాధితులకు చికిత్సలో భాగంగా సూచిస్తారు, ఇక చికిత్సలో భాగంగా అందించే ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీలో బాగా తీక్షణమైన వెలుతురులో 3 – 6 గంటల పాటు ఉంచడం షిఫ్ట్ మొదలవడానికి ముందర కొద్దిసేపు కునుకు పట్టేలా చేయడం. (షార్ట్ షెడ్యూల్డ్ న్యాప్స్ (ప్రీ–షిఫ్ట్) ఇంటికి బయల్దేరే సమయంలో అది సాయంత్రమైనప్పటికీ నల్లటి గాగుల్స్ ధరించేలా చూడటం ఇంటి దగ్గర నిద్ర సమయంలో పూర్తిగా దట్టమైన చీకట్లో నిద్రపోయేలా చేయడం. ఆ టైమ్‌లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉండేలా చూడటం సూర్యోదయం పూట వెలుగు వస్తున్నప్పుడు నిద్రపట్టడానికి మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ ఇవ్వడం బాధితులు ఇంటికి వెళ్లగానే నిద్రకు ఉపక్రమించేలా సూచనలు ఇవ్వడం. కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ (చదవండి: అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!) -
అతీఖ్ హంతకుల జైలు మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్-పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌లను కాల్చి చంపిన నిందితులను అధికారులు జైలు మార్చారు. సన్నీ సింగ్, అరుణ్ మౌర్యా, లవ్లేష్ తొవారిలను ప్రయాగ్‌రాజ్ నైనీ జైలు నుంచి ప్రతాప్‌ఘడ్ జైలుకు మార్చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. నైనీ జైలులో వాళ్లపై దాడి జరగవచ్చేనే నిఘా వర్గాల సమాచారం మేరకు ముగ్గురు హంతకులను జైలు మార్చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫేమస్ కావాలనే తాము అహ్మద్ గ్యాంగ్‌ను ఏరివేసే పనిలో దిగామని, ఈ క్రమంలోనే అతీఖ్, అతని సోదరుడిని కాల్చిచంపామని ఈ ముగ్గురు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు. మరోవైపు కోర్టు వీళ్లకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఇక అతీఖ్,అష్రాఫ్‌ల హత్య ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూడీషియల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. మరోవైపు యూపీ పోలీస్ శాఖ కూడా రెండు సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. యూపీ పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి అతీఖ్, అష్రాఫ్‌లను వైద్యపరీక్షల కోసం తరలిస్తుండగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ఆ ముగ్గురు.. తుపాకులతో కాల్చి చంపిన తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ పోలీసులకు లొంగిపోయారు. వాళ్ల నుంచి ఫేక్ ఐడీకార్డులు , కెమెరా, మైక్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిలో లవ్లేష్కు తూటా కాలి నుంచి దూసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అంతకు ముందు.. బుధవారం ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో ఉమేష్‌పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీఖ్ తనయుడు అసద్ అహ్మద్‌ను, అతన్ని అనుచరుడ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. -
హయత్‌నగర్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్ కార్యాలయం?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని హయత్‌నగర్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగించాలని యోచిస్తోంది. ఇక్కడైతే అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు విస్తృతంగా రవాణా సౌకర్యాలు ఉన్నాయని భావిస్తోంది. అబ్బుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి సజీవదహనంతో అక్కడి ఉద్యోగులు సదరు కార్యాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇన్చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సైతం కార్యాలయానికి వెళ్లేందుకు సాహసించడం లేదు. విజయారెడ్డి హత్య కు గురైన భవనంలో తాము విధులు నిర్వహించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించిన యంత్రాంగం..హయత్‌నగర్‌లోని మండల పరిషత్ ప్రాంగణంలోని భవన సముదాయంలో ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుం దని యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. దీని పట్ల ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీశ్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ఇన్చార్జి కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
షిఫ్ట్ ఉద్యోగాలతో గుండెపోటు..
హౌస్టన్: షిఫ్ట్‌ల ప్రకారం పనిచేసే ఉద్యోగులు గుండె పోటు, స్థూలకాయంతో పాటు ఇత ర ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మానవ శరీరం 24 గంటల సమయానికి అనుగుణంగా నిర్మితమైందని, తీసుకునే ఆహారం నుంచి నిద్ర, ఇంకా అనేక శారీరక ప్రక్రియలు ఏ సమయంలో చేయాలనేది అంతర్గత జీవక్రియలపై ఆధారపడి ఉంటాయని అమెరికాలోని ఏ అండ్ ఎమ్ హెల్త్ సెంటర్‌కు చెందిన డేవిడ్ ఎర్నస్ట్ వివరించారు. ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన పరిశోధకుడు కూడా ఉన్నారు. -
మొండిగౌరెల్లికి చంచల్‌గూడ జైలు
యాచారం: ఉస్మానియా ఆస్పత్రి, ఛాతీ వ్యాధుల వైద్యశాల, సెక్రటేరియట్ తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా లిస్టులో చంచల్‌గూడ జైలు కూడా చేరింది. తాజాగా చంచల్ గూడ జైలు మార్చేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు అధికారులు. ఇందుకోసం రంగారెడ్డి యాచారం మండలం మొండిగౌరెల్లిని ఎంచుకోనున్నట్లు సమాచారం. అధికారులు నాగార్జున సాగర్- హైదరాబాద్ రహదారికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండిగౌరెల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూములను పరిశీలించారు. చంచల్‌గూడ జైలు నగరం మధ్యన ఉండడం, వివిధ కేసుల్లో జైలుకు వచ్చే వీవీఐపీలు, తీవ్రవాదులను జైలు నుంచి కోర్టులకు తీసుకెళ్లడం భద్రత సిబ్బందికి కష్టతరంగా మారింది. ఇంతేకాకుండా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని నగర శివారు, ఔటర్‌రింగు రోడ్డుకు అతి సమీపంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఎంపికపై దృష్టి పెట్టారు. మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూర్ మండలాల్లో కూడా ప్రభుత్వ భూములను పరిశీలించినా మొండిగౌరెల్లినే ఎంపిక చేసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. -
కడప ఉక్కు కర్మాగారాన్ని తరలించొద్దు: సీపీఐ నారాయణ
కడప రూరల్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న ఉక్కు కర్మాగారాన్ని వేరొక ప్రాంతానికి తరలిస్తే ఊరుకోబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. నారాయణ హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లాలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగారాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంకు తరలించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 'కడప ఉక్కు- రాయలసీమ హక్కు' నినాదంతో సోమవారం కడప పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ.. కర్మాగారం తరలింపు ఆలోచనను ప్రభుత్వాలు వెంటనే మానుకోవాలన్నారు. సమావేశంలో కడప ఎమ్మెల్యే అంజద్‌పాషా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మానవ హక్కుల నేతలు పాల్గొన్నారు. -
బద్వేలులో ఆస్పత్రి తరలింపు, ఉద్రిక్తత
బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆసుపత్రి సామగ్రిని తరలిస్తుండగా సోమవారం స్థానికులు అడ్డుకున్నారు. వివరాలు... బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ప్రసూతి ఆస్పత్రి నిర్మించారు. పట్టణం నడిబొడ్డున 150 సంవత్సరాలుగా ఉన్న జనరల్ ఆస్పత్రిని కొత్తగా నిర్మించిన ప్రసూతి ఆస్పత్రి భవనాల్లోకి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఇందుకు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు అన్నివిధాలుగా సౌకర్యవంతంగా ఉన్న ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలించరాదని గతంలో కూడా స్థానికులు వాదించారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగిన కలెక్టర్ జనరల్ వైద్యశాలను ప్రసూతి ఆస్పత్రి భవనాల్లోకి మార్చాలని ఉత్తర్వులిచ్చారు. సోమవారం ఉదయం దాదాపు 200 మంది పోలీసు బలగాలను రప్పించి జనరల్ ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను తరలిస్తుండగా ప్రజలు భారీగా తరలివచ్చి అడ్డుకున్నారు. ఆస్పత్రి ఇక్కడే నిర్వహించాలని భీష్మించారు. ప్రజలను అడ్డుకున్న పోలీసులు ఆస్పత్రిలోని పరికరాలు, ఫర్నీచర్‌ను తరలించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బద్వేలులో ఆస్పత్రి తరలింపు, ఉద్రిక్తత
-
ఛాతి ఆస్పత్రి తరలింపు ఆపాలి- పొన్నాల
హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి తరలింపు వివాదాస్పదం అవుతోంది. చెస్ట్ ఆస్పత్రి తరలింపునకు వ్యతిరేకంగా పలు పార్టీలు అందోళ చేపడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి తరలింపు జోవోను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. చెస్ట్ ఆస్పత్రి కి తరలింపునకు వ్యతిరేకంగా ఎర్రగడ్డలో గురువారం కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పొన్నాల లక్ష్మయ్య తదితర నేతలు పాల్గొన్నారు -
ఎర్రగడ్డలో 'ఛాతీ' వైద్యుల ధర్నా
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది మంగళవారం ఉదయం ధర్నా చేపట్టారు. నగర శివార్లలోని అనంతగిరికి ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను నిరసిస్తూ సిబ్బంది ధర్నాకు దిగారు. ఆస్పత్రి తరలింపును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం)ను ఎత్తివేసి.. దాని స్థానంలో మానసిక రోగుల చికిత్సాలయం, చాతి వైద్యశాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న మానసిక వికలాంగుల చికిత్సాలయం, ఛాతీ వైద్యశాలను అనంతగిరికి తరలించేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలుకు ఒకట్రెండు రోజుల్లో మోక్షం కలుగుతుందని, వారంరోజుల్లో దీనిపై ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రులను పెరేడ్ గ్రౌండ్‌కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఖరీఫ్ కాటేసింది.. రబీ వెక్కిరించింది
-
ఖరీఫ్ కాటేసింది.. రబీ వెక్కిరించింది
తెలంగాణ పల్లెల్లో కరువు ఛాయలు తీవ్ర వర్షాభావంతో కుదేలైన వ్యవసాయం అడుగంటిన ప్రాజెక్టులు, పడిపోయిన భూగర్భ జలాలు దిక్కుతోచని స్థితిలో రైతులు, కూలీలు కరువు ప్రభావంతో పెరుగుతున్న వలసలు పనులు లేక ఖాళీ అవుతున్న ఊళ్లు నగరాలు, పట్టణాలకు తరలివెళుతున్న కుటుంబాలు సాక్షి నెట్వర్క్/హైదరాబాద్: తెలంగాణ పల్లెలు కరువు కోరల్లో చిక్కాయి. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం వెక్కిరించింది. ఆదాయమార్గం లేక రైతన్నలకు దిగులే మిగిలింది. ఉపాధి కరువై కూలీల్లో కలవరం మొదలైంది. గత్యంతరం లేక పేద కుటుంబాలు వలసబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర వర్షాలతో ఖరీఫ్ ఆదుకోలేదు. నీళ్లు లేక రబీలో పంటలే వేయలేదు. దీంతో ఉపాధి కోసం వలసలు జోరందుకున్నాయి. ఈ సమయానికి రబీ పనులతో కళకళలాడాల్సిన పల్లెలు కళావిహీనమయ్యాయి. కాలం కలసిరాక చిన్నకారు రైతులు, పొలం పనులు దొరక్క వ్యవసాయ కూలీలు ఉన్న ఊళ్లను విడిచిపెడుతున్నారు. ఉన్నచోట ఉపాధి లభించక తల్లడిల్లే దయనీయస్థితిలో పట్టణాలకు బయలుదేరుతున్నారు. ఈ ఏడాది తగ్గిపోయిన సాగు విస్తీర్ణమే అసలు దుస్థితిని కళ్లకు కట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో 13.09 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంటే.. ఇప్పటివరకు కేవలం 5.16 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. దాదాపు 120 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు అలుముకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే రాష్ర్టంలో నాలుగో వంతు పల్లెలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. సాధారణ వర్షపాతంకన్నా ఈ ఏడాది 33 శాతం తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే ఖరీఫ్‌లో అకాల వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టం రైతుల కొంప ముంచింది. మరోవైపు నిరుటితో పోల్చితే జల వనరులన్నీ బాగా ఇంకిపోయాయి. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నీటిమట్టం ఆందోళనకరస్థాయికి పడిపోయింది. భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. గత రబీ సీజన్ ఆరంభంలో 7 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలం ఈ రబీ సీజన్ ఆరంభానికి 9.70 మీటర్లకు పడిపోయింది. బోర్లు, బావుల నుంచి నీటిని తోడే భగీరథ యత్నాలకే రైతులు అప్పుల పాలవుతున్నారు. దీంతో అన్నదాతలకు సేద్యం భారంగా మారింది. ఈ దుర్భర పరిస్థితులు వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీయగా.. ఈ ప్రభావంతో పరోక్షంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. వ్యవసాయ కూలీలకు గడ్డుకాలం చిన్న సన్నకారు రైతులు ఉపాధి వెతుక్కునే పనిలో పడటంతో కూలీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది కూలీలు వలస వెళ్లినట్లు అంచనా. గత ఏడాది ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా 6.18 లక్షల ఇళ్లకు తాళాలున్నట్లు లెక్క తేలింది. అప్పటికీ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు ఎంతో ప్రయాస పడి ఈ సర్వేలో పాలుపంచుకునేందుకు స్వస్థలాలకు తిరిగొచ్చాయి. అయినా లక్షలాది ఇళ్లకు తాళాలే దర్శనమిచ్చాయి. ఈ లెక్కన వసల వెళ్లిన కుటుంబాల సంఖ్య భారీగానే ఉంటుందని అర్థమవుతోంది. కాగా, తాజాగా నెలకొన్న పరిస్థితులతో రెండు నెలలుగా పనులు దొరక్క పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పాలమూరు జిల్లా నుంచే ఏటా పది లక్షల మంది కూలీలు వలసపోతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానాతో పాటు హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా వారే కనిపిస్తారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి గల్ఫ్ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ర్టం నుంచి దాదాపు 15 లక్షల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అంచనా. వీరిలో అప్పుల పాలైన రైతులే ఎక్కువ మంది ఉన్నారు. ఇక గుజరాత్లో దాదాపు మూడు లక్షల మంది తెలంగాణ వారున్నారని ఇటీవలే ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ బృందం గుర్తించింది. రైతులతో పాటు చేనేత, గీత కార్మికులు ఉపాధి కరువై గుజరాత్, ముంబాయిలో బతికేందుకు బయల్దేరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంది పొరుగున ఉన్న మహారాష్ట్రకు వలస వెళుతున్నారు. ఇప్పటికే సిర్పూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు ఖాళీ అయ్యాయి. మరోవైపు వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి పనులు అరకొరగానే సాగుతున్నాయి. గత నెల రోజుల్లో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉపాధి పనులు కావాలని కోరుతున్న కూలీల సంఖ్య రెట్టింపైంది. కానీ ఉపాధి హామీ పనులను విస్తరించేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో పేదలకు వలస మార్గమే శరణ్యమవుతోంది. కరువు మండలాలు 120 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక అందింది. ఆ ప్రకారం రాష్ట్రంలో 120 వరకు కరువు మండలాలున్నాయి. అయితే పంట కోత ప్రయోగాల (సీసీఈ) రిపోర్టు రావాల్సిన అవసరం ఉందని... అప్పుడే పూర్తిస్థాయి నివేదిక వచ్చినట్లు అవుతుందని వ్యవసాయ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. సీసీఈ రిపోర్టు వస్తే మరో 80 మండలాలు కరువు జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాటితో కలిపి రాష్ట్రంలో 200 కరువు మండలాలు అవుతాయి. సీసీఈ రిపోర్టు వచ్చాకే కరువు మండలాలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సీసీఈ నివేదిక రావడానికి ఈ నెలాఖరు వరకు పట్టనున్నట్లు సమాచారం. అయితే కరువు మండలాల ఎంపికలో జాగు ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణ వస్తున్నాయి. యంత్రాంగం నిర్లిప్తత ఫలితంగా కరువుపై కేంద్రానికి నివేదిక పంపడం ఆలస్యం అవుతుందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర బృందం పర్యటన మరింత ఆలస్యం అవుతుంది. ఫలితంగా రైతుకు అందాల్సిన పరిహారం సరైన సమయంలో అందని పరిస్థితి దాపురించనుంది. అప్పులు తీర్చేందుకు వెళ్లాడు మాకు రెండెకరాల భూమి ఉంది. పొలం సాగు చేద్దామని రూ. 30 వేలు పెట్టి బోరు వేశాం. చుక్కనీరు కూడా రాలేదు. ఉన్న భూమి బీడుగా మారుద్దని మరో చోట బోరు వేశాం. రూ. 40 వేలు ఖర్చయినా నీళ్లు పడలేదు. వ్యవసాయం చేసి అప్పులు తీర్చే మార్గం కనిపించక మరో రూ. లక్ష అప్పు చేసి మా ఆయన దేవరాజు సౌదీకి వెళ్లాడు. నేను కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. - గద్ద పద్మ, కొలనూర్, కోనరావుపేట మండలం, కరీంనగర్ వరంగల్‌లో తండాలు ఖాళీ ఉపాధి లభించే పరిస్థితి లేక వరంగల్ జిల్లాలోని పలు తండాల్లోని కుటుంబాలు వలసబాట పట్టాయి. కురవి మండల కేంద్రం శివారులోని కీమ్యా తండాలో 20 కుటుంబాలు వలస వెళ్లాయి. వారిలో చాలా మంది హైదరాబాద్‌కు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అలాగే మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామంలో 10 కుటుంబాలు, కస్నా తండాలో 30 కుటుంబాలు, గుండ్రాళ్ళగడ్డ తండాలో 10 కుటుంబాలు పట్టణాలకు తరలాయి. పనిలేక వలసపోతుండ్రు మా తండాలో పని కరువై గిరిజనులంతా వలస పోతుండ్రు. నేను, నా భార్య, మనుమరాలు ముగ్గురమే ఇక్కడ ఉన్నాం. నా ఇద్దరు కొడుకులు, కోడళ్లు కూడా నిజామాబాద్ జిల్లాలోని ఫ్యాక్టరీలో పనికి వెళ్లారు. అందరూ మళ్లీ ఉగాదికి తిరిగొస్తరు. తండాలోని 50 ఇళ్లలో ప్రస్తుతం పది మంది వృద్ధులం మాత్రమే ఉన్నాం. వ్యవసాయభూమి ఉన్నా నీళ్లు లేవు. మా తండాకు రోడ్డు మార్గం లేదు. నీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం పోతున్నాం. - హఠ్యానాయక్, మల్పరేగడి తండా, అబ్బెంద, నారాయణఖేడ్ మండలం, మెదక్