టెక్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి'. ప్రారంభం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. నేడు కోట్ల సంపదకు నాయకుడైన ఈయన ఎంతోమందికి ఆదరప్రాయం. ఖచ్చితమైన సిద్ధాంతాలను పాటించే మూర్తి.. తాను మంచి వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.
నాయకుడిగా నేను మొదటి నేర్చుకున్న విషయం న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకోవడం. ప్రతి లావాదేవీలో న్యాయంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నేను మంచి వ్యక్తిగా కాకూండా.. న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని అన్నారు.
1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తి పూణేలో ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ.. ముందుకు సాగుతోంది. ఇప్పటికి కూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రతి విద్యార్ధి చదవాల్సిన పుస్తకం
ఇదిలా ఉండగా.. ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దేశంలో ప్రతి విద్యార్ధి తప్పకుండా.. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని చదవాలని సూచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment