Harsh Goenka Latest Tweet On Ratan TATA and Infosys Narayana Murthy - Sakshi
Sakshi News home page

Harsh Goenka : ఫోటో పాతదే.. ఫీలింగ్‌ ఫరెవర్‌..

Published Mon, Dec 27 2021 2:26 PM | Last Updated on Mon, Dec 27 2021 2:49 PM

Harsh Goenka Latest Tweet On Ratan TATA and Infosys Narayana Murthy - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ ఇండస్ట్రీస్‌ చైర​‍్మన్‌ హార్ష్‌ గోయెంకా తాజాగా చేసిన ట్వీట్‌ నెట్టింట ఆసక్తి రేపుతోంది. ఈ ట్వీట్‌లో ఉన్న ఫోటో పాతదైన సరే అందులో ఉన్న వ్యక్తులు, వారు సాధించిన ఘనతలు.. ఈ ఇద్దరు లెజెండ్స్‌ గురించి మరో బిజినెస్‌ దిగ్గజం చేసిన కామెంట్లు ట్విట్టర్‌లో భావోద్వేగపూరిత సంభాషణలకు తెర లేపాయి.

కోవిడ్‌ సంక్షోభం ఇండియాను ముట్టడించకముందు 2020 జనవరిలో ముంబైలో ఓ ప్రైవేటు కార్యక్రమం జరిగింది. ఇందులో రతన్‌టాటాకి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ని ఇన్పోసిన్‌ నారాయణమూర్తి అందించారు. ఈ సందర్భంగా భారతీయ పారిశ్రామికవేత్తలకు దార్శనికుడైన రతన్‌టాటా పాదాలకు నారాయణమూర్తి పాదాభివందనం చేశారు. ఈ ఫోటో అప్పుడు కూడా చాలా మందిని ఆకట్టుకుంది.

తాజాగా అదే ఫోటోను హార్ష్‌గోయెంకా ట్వీట్‌ చేస్తూ చక్కని కామెంట్‌ని జత చేశారు. ‘వెదురు చెట్టులా మనం ఉండాలి. జీవితంలో ఎంత ఎత్తులకు ఎదిగినా అణకువతో ఒదిగి ఉండాలి’ అనే అర్థం వచ్చేలా కామెంట్‌ జత చేశారు. ఈ ఫోటో నెటిజన్లకు బాగా నచ్చడంతో ఇందులో భాగస్వాములైన ముగ్గురి లెజెండ్స్‌ జీవితాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. 

చదవండి: Vijay Mallya : రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement