ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'నారాయణ మూర్తి' (Narayana Murthy) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సొంతంగా ఉపయోగించే టాయిలెట్లను శుభ్రం చేయడం గురించి, రాజకీయాలపై తనకున్న ఆసక్తిని గురించి ప్రస్తావించారు.
సమాజంలో మరుగుదొడ్లను శుభ్రం చేసేవారిని చాలా చిన్న చూపు చూస్తారని, అందువల్లే నా పిల్లలకు మన టాయిలెట్లను మనమే శుభ్రం చేసుకోవాలని, సమాజంలో ఎవరూ తక్కువ కాదని చెప్పడానికి, సొంతంగా ఉపయోగించే టాయిలెట్లను శుభ్రం చేసుకోవడం గురించి వివరించారు.
నా పిల్లలు అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారని, వారి ప్రశ్నలకు ప్రేమతో సమాధానాలు చెబుతానని వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం చాలామంది ధనవంతుల కుటుంబాలలో సొంత టాయిలెట్లను సొతంగా శుభ్రం చేసుకునే పద్దతి పూర్తిగా నిషిద్ధంగానే ఉందని తెలిపారు.
రాజకీయాల్లో చేరే ఆలోచన ఉందా..
నారాయణ మూర్తిని రాజకీయాల్లో చేరే ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు తనకు లేదని.. తన పిల్లలు, మనవళ్లతో గడపాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పారు. అంతే కాకుండా.. సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. భౌతిక శాస్త్రం నుంచి అర్ద శాస్త్రం వరకు వివిధ అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నట్లు కూడా వివరించారు.
ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి..
రచయిత్రి, పరోపకారి అయిన 'సుధామూర్తి' (Sudha Murthy) కూడా ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని కూడా నారాయణ మూర్తి తెలిపారు. అవసరమైనప్పుడు తప్పకుండా సమాజానికి సేవ చేస్తామని, దానికోసం రాజకీయాల్లో స్థానం తనకు అవసరం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment