
శ్రీవారి ఆలయంలో సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులు
తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం వైకుంఠం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. మహాద్వారం వద్ద ఇస్థికాపాల్‌తో టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి హోదాలో మహాద్వార ప్రవేశం ఉన్నప్పటికీ.. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణీ, మనవడు దేవాన్ష్, బావమరిది బాలకృష్ణ కుటుంబంతో కలిసి వైకుఠం నుంచి ఆలయ ప్రవేశం చేశారు. బుధవారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు కావడం వల్లనే స్వామి ఆశ్సీస్సుల కోసం సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులు వచ్చినట్లు సమాచారం.