
లండన్: బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 తనకి 10వ మునిమనవడు పుట్టినందుకు ఆనందంతో పొంగిపోతున్నారు. రాణి ఎలిజబెత్ మనవరాలు జారా తిండాల్ బాబుకి జన్మని చ్చారు. ఆ బాబుకి లుకాస్ ఫిలిప్ తిండాల్ అని పేరు పెట్టారు. బ్రిటన్ సింహాసనానికి క్యూ కట్టిన వారసుల్లో లుకాస్ 22వ స్థానంలో ఉన్నాడు.
రాణి ఎలిజెబెత్ కూతురి కూతురైన జారా తిండాల్, ఆమె భర్త ఇంగ్లండ్ రగ్బీ మాజీ ఆటగాడు మైక్ తిండాల్‌కు మూడో సంతానంగా లుకాస్ పుట్టాడు. జారా బాత్ రూమ్‌లోనే బాబుకి జన్మనివ్వడం విశేషం. ఆస్పత్రికి తీసుకువెళ్లే వ్యవధి లేకపోవడంతో బాత్‌రూమ్‌లోనే తమ బిడ్డకు స్వాగతం పలికారు. రాణి దంపతులు బాబును చూడాలని ముచ్చట పడుతున్నారని, పరిస్థితులు అనుకూలించాక వాళ్లు కలుసుకుం టారని ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment