యాంకర్‌ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్‌ అయిన ‘రాములమ్మ’ | Anchor Sreemukhi Grandmother Passed Away | Sakshi
Sakshi News home page

Anchor Sreemukhi: శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం.. రాములమ్మ ఎమోషనల్‌ పోస్ట్‌

Sep 15 2021 4:34 PM | Updated on Sep 15 2021 5:22 PM

Anchor Sreemukhi Grandmother Passed Away - Sakshi

యాంకర్‌ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం శ్రీముఖి అమ్మమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ శ్రీముఖి ఎమోషనల్‌ అయింది. ‘అమ్మమ్మ అంటే నాకు ఇష్టం. జీవితంలో చాలా విషయాలను తన నాకు చెప్పింది. ఎప్పుడూ హుషారుగా ఉండేది. అందరికి సంతోషాన్ని పంచేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని అందరికీ పంచేది. ఆమె చాలా ధైర్య వంతురాలు. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ ’అంటూ ఎమోషనల్‌ అయింది యాంకర్‌ శ్రీ ముఖి. ఇక శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.

ఇక శ్రీముఖి విషయానికొస్తే.. యాంకర్‌గా, నటిగా తనదైన మాటతీరులో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. బుల్లి తెరపై పలు షోలకు యాంకర్‌గా చేస్తూనే.. అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తోంది. ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్‌’మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement