Jabardasth Fame Sudigali Sudheer Grandmother Passes Away Due To COVID-19 - Sakshi
Sakshi News home page

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ ఇంట్లో విషాదం

Published Tue, May 18 2021 11:38 AM | Last Updated on Tue, May 18 2021 5:35 PM

Sudigali Sudheer Grandmother Passes Away Due To Covid - Sakshi

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు ఈ ప్రాణాంతక మహమ్మారి. వందలాది సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. టాలీవుడ్‌ నటులు, దర్శకులు, రచయితలు ఇలా చాలా మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. తాజాగా కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ ఇంట్లో విషాదాన్ని నింపింది.

కరోనాతో ఇటీవల సుడిగాలి సుధీర్‌ అమ్మమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని ఓ కామెడీ షోలో ఆటో రాంప్రసాద్‌ వెల్లడించాడు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్‌ వెల్లలేకపోయాడని, చివరి చూపులు కూడా దక్కలేదని రాంప్రసాద్‌ తెలిపాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న సుధీర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement