ప్రేమకు తరతమ బేధాలు, అంతరాలు ఉండబోవని ప్రేమను పండించుకున్న కెనడా బామ్మ, పాక్ కుర్రాడు నిరూపించారు. పాకిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల కుర్రాడు కెనడాకు చెందిన 70 ఏళ్ల బామ్మ ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ ఎంతలా వికసించిందంటే, చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకుని, జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
వరుని పేరు నయీమ్ షాజాద్. 70 ఏళ్ల ఆ కెనడియన్ వధువు పేరు మేరీ. అయితే వీరి ప్రేమను, పెళ్లిని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. వీసా కోసం నయీమ్ ఇటువంటి పని చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని వీరిద్దరూ ఖండించారు. 35 ఏళ్ల నయీమ్ షాజాద్, మేరీ మధ్య సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్ ద్వారా ప్రేమ మొదలైంది. తామిద్దరూ 2012లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో కలిశామని నయీమ్ మీడియాకు తెలిపాడు. 2015లో మేరీ నయీమ్‌కు పెళ్లి ప్రపోజ్ చేసింది. 2017లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే వీసా సమస్య కారణంగా కెనడాలో ఇద్దరూ కలిసి జీవించలేకపోయారు. మేరీ ఇటీవల పాకిస్తాన్‌ను సందర్శించి, అతని దగ్గర 6 నెలలపాటు ఉంది.
నయీం గతంలో ఆర్థికంగా, మానసికంగా దిగజారి ఉన్నాడు. అయితే మేరీ అతనికి ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా, మానసిక ధైర్యాన్ని కూడా అందించింది. అయితే మేరీ ధనవంతురాలేమీ కాదని, పెన్షన్‌తో బతుకుతున్నదని నయీమ్ చెప్పాడు. కాగా కెనడా వెళ్లేందుకు, డబ్బు కోసమే మేరీని నయీం పెళ్లి చేసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తుంటారు. అయితే నయీమ్ ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ, ఇలాంటివాటిని తాను పట్టించుకోనని అన్నాడు. తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు మేరీ ఎంతో సాయం అందించిందని, అందుకే తాను ఆమె ప్రేమలో పడ్డానని నయీమ్ తెలిపాడు.
ఇది కూడా చదవండి: స్కూలు టాయిలెట్‌లో శిశు జననం.. మాయమైన తల్లి
Comments
Please login to add a commentAdd a comment