
మృతి చెందిన సుశీల
పట్నంబజారు(గుంటూరు): ఆస్తి కోసం నాయనమ్మను మనవడు హత్య చేసిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక శ్రీనివాసరావుపేటలో ఆకుల యలమంద, అతని భార్య పద్మావతి, తల్లి సామ్రాజ్యం, నానమ్మ సుశీల (70) నివసిస్తున్నారు. ఆస్తి తన పేరున రాయాలని సుశీలను యలమంద గొడవ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఆరో తేదీ రాత్రి 2.30 గంటల సమయంలో సుశీలను చీరతో ఉరి బిగిస్తుండగా ఆమె కేకలు వేసింది. ఇంటి పక్కన ఉండే నరసింహ కుటుంబ సభ్యులు వచ్చి చూడటంతో యలమంద పరారయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సుశీల మృతి చెందింది. ఆస్తి రాయలేదనే కోపంతో వృద్ధురాలిని మనవడే హత్య చేసినట్లు నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment