వీడియో దృశ్యం
న్యూయార్క్ : ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు మన బుర్ర పనిచేయటం మానేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేక తికమకపడిపోతాము. కుటుంబసభ్యులకు లేదా ఆప్తులకు ప్రమాదం జరిగినపుడు మన పరిస్థితి ఊహించటం కష్టం. చాలా మంది ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ, ఏదో ఒకటి చేసేస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రం బాధను నొక్కిపట్టి ఏం చేస్తే వారిని రక్షించుకోవచ్చో అది చేస్తారు. ఆ కొద్దిమందిలో ఒకడే అమెరికాకు చెందిన పీజే అనే 11 ఏళ్ల బాలుడు. కొద్దిరోజుల క్రితం అతడి బామ్మ బ్రేవర్ లేయే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గి నడవలేక కిందపడిపోయింది. ( వారెవ్వా.. వాట్ ఏ డ్రైవింగ్ స్కిల్స్ )
ఆ సమయంలో దూరంగా కారు నడుపుతున్న పీజే ఆమెను గమనించాడు. వెంటనే కారు బ్రేవర్ దగ్గరకు తీసుకెళ్లి అందులో ఆమెను ఎక్కించి ఆసుపత్రికి చేర్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ దేవుడు అతడ్ని నీ కోసమే పంపాడు! ... మీ అదృష్టం బాగుండి బతికిపోయారు... కుర్రాడు చాలా తెలివిగా ప్రవర్తించాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment