పాపం.. పాపను బంతిలా విసిరికొట్టింది | Woman kills her infant grand daughter for want of grand son | Sakshi
Sakshi News home page

పాపం.. పాపను బంతిలా విసిరికొట్టింది

Published Wed, Sep 28 2016 2:12 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

పాపం.. పాపను బంతిలా విసిరికొట్టింది

పాపం.. పాపను బంతిలా విసిరికొట్టింది

మనవడు కావాలని కోరుకున్న ఓ మహిళ.. కోడలు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఉన్మాదిలా ప్రవర్తించింది. అభంశుభం తెలియని రెండునెలల చిన్నారి మనవరాలిని గొంతునులిమి చంపేసి నేలపై విసిరికొట్టింది. హరియాణాలోని బహదూర్గఢ్లో ఈ దారుణం జరిగింది.

సుదేష్‌ అనే మహిళ మనవడు కావాలని కోరుకుందని, రెండు నెలల క్రితం కోడలు ఆడ్డబిడ్డకు జన్మనిచ్చిందని, అప్పటి నుంచి కోడలిని వేధించిందని పోలీసులు చెప్పారు. పుట్టింటిలోనే ఉండాల్సిందిగా ఆమెను హింసించేవారు. మంగళవారం కోడలు బిడ్డను తీసుకుని అత్తమామల ఇంటికి వచ్చింది. సుదేష్ కోడలితో గొడవపెట్టుకుని, మనవరాలి గొంతుపిసికి విసిరేసింది. కోడలు వెంటనే పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లగా, అప్పటికే చిన్నారి చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. ఆమె ఫోన్ చేసి ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. పోలీసులు సుదేష్తో పాటు ఆమె భర్త, కొడుకుపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement