అమ్మ,అమ్మమ్మని నరికేశాడు..
అనంతపురం అర్బన్ : ఆస్తి కోసం కన్నతల్లిని, అమ్మమ్మను దారుణంగా నరికి చంపిన ఘటన సోమవారం అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులో చోటుచేసుకుంది. తల్లి పుష్పలత(42), అమ్మమ్మ బాలనాగమ్మ(58) లు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. నిందితుడు కిరణ్ కుమార్ పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.