గరివిడి (విజయనగరం జిల్లా) : కుటుంబకలహాల నేపథ్యంలో బామ్మను మనవడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుచంభాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాపుచంభాం గ్రామానికి చెందిన యడ్ల గొల్లబాబు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా తన బామ్మ యడ్ల నర్సమ్మ(63)తో శనివారం గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో గొల్లబాబు బామ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మండల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
బామ్మను చంపిన మనవడు
Published Sat, Jul 25 2015 7:31 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement