Desi Nani Tries to Eat Pizza for First Time, Her Reaction Video Goes Viral - Sakshi
Sakshi News home page

Pizza: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ.. ఆమె చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా

Published Tue, Nov 9 2021 3:25 PM | Last Updated on Tue, Nov 9 2021 4:04 PM

Desi Nani Tries To Eat Pizza For First Time, Her reaction is Viral - Sakshi

పిజ్జా.. ఈ పేరు వింటేనే భోజన ప్రియులకు నోరూరుతుంది. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌తో టాపింగ్‌ చేసే ఇటాలియన్‌ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ యాప్‌లు వచ్చి తర్వాత చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఘుమఘుమలాడే పిజ్జా నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. వెజ్‌, నాన్‌వెజ్‌ అంటూ చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. 
చదవండి: మట్టి ముంతలో స్పెషల్‌ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది

తాజాగా ఓ బామ్మ తొలిసారి పిజ్జాను రుచి చూసింది. దీనిని ఆమె మనవడు గ్రీష్‌ భట్‌ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇంకేముంది ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో.. బామ్మ పిజ్జాలోని ఒక ముక్కను తీసుకొని తింటుంది. అయితే అది ఆమెకు అంతగా నచ్చలేదేమో.. వెంటనే అదో రకంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ముసిమసిగా నవ్వుతుంది. ‘మొదటిసారి పిజ్జా తింటున్న నాన్నమ్మ రియాక్షన్‌’ అనే క్యాప్షన్‌తో ఫేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షల వ్యూవ్స్‌ సంపాదించింది. 

పిజ్జా రుచి చూసిన ఆ భామ్మ ఇచ్చిన హవభావాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ‘అయ్యో బామ్మకు పిజ్జా నచ్చలేదనుకుంటా.. ఆమె రియాక్షన్‌ చూస్తుంటే అబ్బే బాలేదురా మనువడా.. ఎలా తింటారు దీన్ని.. అనేలా ఉంది. పిజ్జా తినేప్పుడు నాని చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి’. అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరి మీరు కూడా చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement