లండన్ : 82 ఏళ్ల వయసులో ఓ బామ్మ హాట్ మోడల్స్‌కు దీటుగా మోడలింగ్‌లో దూసుకుపోతోంది. ఉద్యోగం నుంచి రిటైరైన బార్బర్ అనే బామ్మ సీనియర్ మోడల్ కావాలంటూ ఓ పత్రికలో ప్రచురించిన యాడ్‌ను చూసి ఇంప్రెస్ అయి ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె ఆస్ర్టేలియాలో ప్రముఖ యాడ్ ఏజెన్సీ ఎంజీఎంటీకి మోడల్‌గా ఒప్పందంపై సైన్ చేశారు.తనకు ఎంతో ఇష్టమైన దుస్తులను వేసుకునే అవకాశం ఇప్పుడు కలగడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారామె.
యువతులకే అందమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయని, తమలాంటి వారికోసం ఇలాంటి దుస్తులు మార్కెట్లో లేవని తానెప్పుడు తన ముగ్గురు కుమార్తెలతో అంటుంటానని బార్బర్ చెప్పుకొచ్చారు. మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని తాను చెప్పగా తన కుమార్తెలు ప్రోత్సహించారన్నారు.
మహిళల ఫ్యాషన్ బ్రాండ్ అడ్రిప్ట్కు ప్రకటనల షూట్ కోసం ఇటీవల ఆమె తన స్వస్థలం టామ్‌వర్త్ నుంచి బ్రిస్బేన్కూ వెళ్లారు. ఈ వయసులోనూ ఆమె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటంతోనే ఆమె కోరుకున్న వృత్తిలో రాణిస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారని అడ్రిఫ్ట్ ప్రతినిధి చెప్పారు. మోడలింగ్‌లో ప్రతి క్షణాన్నీ తాను ఆస్వాదిస్తున్నానని బార్బర్ చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment